రాష్ట్రీయం

ఇక వానలే వానలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: ఈ సీజన్‌లో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈనెల 16 వరకు 15 జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా 16 జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ పరిశోధనా కేంద్రం తెలిపింది. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ పరిశోధనా కేంద్రం హెచ్చరించింది. కొంకణ్, మధ్య కర్నాటక, రాయలసీమ, కొస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించినట్టు వెల్లడించింది. మరో మూడు, నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిస్సాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది దక్షిణ దిశగా కదులుతున్నట్టు పేర్కొంది. అల్పపీడనానికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీంతో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
భారీ వర్షాలు..
ఆదిలాబాద్, కొమురంభీం, అసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న-సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్- భూపాల్‌పల్లి, మహబూబాబాద్, భద్రాచలం- కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ పరిశోధనా కేంద్రం అధికారులు తెలిపారు.
మోస్తరు వర్షాలు..
హైదరాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, మెడ్చల్-మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు, జోగులాంబ-గద్వాల్, నల్లగొండ, యాదాద్రి-్భవనగిరి, వరంగల్ (అర్బన్), వరంగల్ (రూరల్), జనగాం, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు.
జంట నగరాల్లో..
ఇలాఉండగా శుక్రవారం జంట నగరాల్లో కొన్నిచోట్ల భారీ, మరికొన్నిచోట్ల తేలికపాటి వర్షం కురిసింది. గురువారం ఉదయం తెల్లవారుజామున 3 గంటలపాటు కురిసిన వర్షంతో నగరం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షం నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఉదయానే్న ఉద్యోగాలకు వెళ్ళే వారు, వాణిజ్య, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇలాఉండగా శుక్రవారం రాష్టవ్య్రాప్తంగా అనేక ప్రాంతాల్లో 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవ్వడం గమనార్హం.

చిత్రం.. భారీ వానకు తడిసి ముద్దవుతున్న హైదరాబాద్