రాష్ట్రీయం

విద్యుత్ సరఫరా పరస్పరం బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 10: అనుకున్నట్లుగానే ఆంధ్ర, తెలంగాణ మధ్య విద్యుత్ సరఫరా బంద్ అయింది. ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చే 1200 మెగావాట్ల విద్యుత్‌ను నిలిపివేస్తున్నట్లు ఏపి ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. ఈ విషయమై పునస్సమీక్షించే ప్రసక్తిలేదన్నారు. తమకు రావాల్సిన రూ.4500 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంపై ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తెలంగాణ కూడా తమకు సరఫరా చేస్తున్న విద్యుత్‌ను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించిందన్నారు. మూడేళ్లుగా రెండు రాష్ట్రాల మధ్య పునర్విభజన చట్టానికి లోబడి పరస్పరం విద్యుత్ సరఫరా చేసుకుంటున్నాయి. ఆంధ్ర నుంచి తెలంగాణకు 1200 మెగావాట్ల విద్యుత్ వస్తే, తెలంగాణ నుంచి ఆంధ్రకు 800 మెగావాట్ల విద్యుత్ సరఫరా అవుతోంది. తమకు చెల్లించాల్సిన బకాయిలు రూ.1676 కోట్లు ఉన్నాయని, ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించకపోతే విద్యుత్‌ను నిలిపివేస్తామని తెలంగాణ జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు ప్రకటించిన విషయం విదితమే. చర్చల ద్వారా సామరస్య పూర్వకంగా పరిష్కరించేందుకు సిద్ధమని ఇప్పటికే తెలంగాణ జెన్కో ప్రకటించింది. తమకు 400 మెగావాట్ల విద్యుత్ మాత్రమే లోటు ఉంటుందని, మార్కెట్‌లో ఇంతకంటే విద్యుత్ తక్కువ రేటుకు లభిస్తోందని చెప్పారు.
ఆంధ్రలోని విజయవాడ థర్మల్, రాయలసీమ థర్మల్ ప్లాంట్లనుంచి విద్యుత్ తెలంగాణకు సరఫరా అవుతుండగా, కొత్తగూడెం తదితర థర్మల్ ప్లాంట్ల నుంచి ఆంధ్రకు విద్యుత్ సరఫరా అవుతోంది. ఈ మొత్తం వివాదంలో రెండు రాష్ట్రాలు మరో రాష్ట్రానికి విద్యుత్ సరఫరా నిలుపుదల చేయడం వల్ల ఆంధ్రకు 800 మెగావాట్ల విద్యుత్ మిగిలితే, తెలంగాణకు 400 మెగావాట్ల విద్యుత్ లోటు ఏర్పడుతుంది.