రాష్ట్రీయం

కదం తొక్కిన టీచర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 10: రేషనలైజేషన్ పేరిట పాఠశాలల మూసివేత, ఉపాధ్యాయ బదిలీల్లో ఆన్‌లైన్ విధానం రద్దు అంశాలపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటిని శనివారం ముట్టడించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఉపాధ్యాయుల ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న సాకుతో పలు పాఠశాలలను సమీప పాఠశాలల్లో విలీనం చేసేలా రేషనలైజేషన్ చేపట్టడంపై ఉపాధ్యాయ సంఘాలు జాక్టో, ఫ్యాక్టోలు మండిపడ్డాయి. దీనివల్ల సామాన్య ప్రజానీకానికి ప్రభుత్వ విద్య అందనిద్రాక్షగా మిగులుతుందని ఆరోపించారు. విద్యాసంవత్సరం ప్రారంభం అవుతున్న తరుణంలో ఇప్పుడు ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించడం కూడా ప్రభుత్వ తీరుకు అద్దం పడుతోందని ఉపాధ్యాయ సంఘాలు విమర్శించాయి. ఉపాధ్యాయ బదిలీల్లో వెబ్ కౌనె్సలింగ్ విధానం వల్ల బదిలీ ప్రక్రియలో అవకతవలకు ఆస్కారమేర్పడుతుందన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో మంత్రి ఇంటిని చుట్టుముట్టడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఉపాధ్యాయులను అదుపుచేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మంత్రి గంటాకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలువురు ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకుని, అనంతరం విడిచిపెట్టారు.

చిత్రం.. మంత్రి గంటా ఇంటిని ముట్టడిస్తున్న ఉపాధ్యాయులు