రాష్ట్రీయం

విస్తరిస్తున్న స్కాలర్‌షిప్‌ల స్కాం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 10: గుంటూరు ట్రెజరీలో బయటపడిన స్కాలర్‌షిప్‌ల కుంభకోణం తాలూకు ప్రకంపనలు ఇతర జిల్లాలకూ వ్యాపించాయి. పశ్చిమగోదావరి, నెల్లూరు, విజయనగరం తదితర జిల్లాల ట్రెజరీల్లో స్కాలర్‌షిప్‌ల కుంభకోణం జరిగినట్టు సమాచారం రావటంతో విచారణకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. త్వరలో కమిటీలు ఏర్పాటు చేసి కుంభకోణాలపై విచారణ జరపనున్నట్టు ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా కేంద్రం రెండేళ్ల క్రితం దేశవ్యాప్తంగా కార్పొరేట్ నేషనల్ బ్యాంకింగ్ సర్వీస్‌ను అమల్లోకి తెచ్చింది. ఈ విధానంలోని లోపాలను ఆసరాగా చేసుకుని ఆంధ్రప్రదేశ్‌లో ట్రెజరీ సిబ్బంది కొందరు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. గతంలో ప్రభుత్వ శాఖల బిల్లులు, అలాగే కాంట్రాక్టర్ల బిల్లులు, ఉద్యోగుల పెన్షన్, ఇతరత్రా బిల్లులను ట్రెజరీ కార్యాలయాలకు అందిన వెంటనే వాటిని బ్యాంక్‌కు పంపించి చేతులు దులుపుకునేవారు. ఇక బ్యాంక్ నుంచే సంబంధిత ఖాతాలకు నేరుగా సొమ్ము జమ అయ్యేది. అయితే సరికొత్త విధానంలో బిల్లులు బ్యాంక్‌కు వెళ్లిన వెంటనే ఆన్‌లైన్‌లో నగదు మొత్తం తిరిగి సంబంధిత ట్రెజరీ శాఖ ఖాతాకు చేరి ఆ తర్వాత సంబంధిత వ్యక్తుల లేదా సంస్థల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతోంది. అయితే 2014-15, 2015-16 విద్యా సంవత్సరాలకు సంబంధించి విద్యార్థుల ఉపకార వేతనాల్లో కుంభకోణం ఇటీవల గుంటూరు ట్రెజరీలో వెలుగు చూసింది. కొందరు సిబ్బంది స్కాలర్‌షిప్ సొమ్మును తమ సొంత ఖాతాలకు జమ చేసుకుంటున్న వైనం బయటపడింది. దీనిపై గత పది రోజులుగా విశాఖట్నానికి చెందిన ప్రత్యేక అధికారుల బృందం గుంటూరులోనే మకాం వేసి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరక్టర్ సురేంద్రబాబు మూడు నెలల లాంగ్ లీవ్‌పై వెళ్లిపోయారు. ప్రభుత్వమే బలవంతంగా పంపించిందనే ప్రచారం సాగుతున్నది. ఇక విచారణాధికారులను ఈ విషయమై ప్రశ్నించగా ఇప్పుడే తాము నేరుగా ఏమీ చెప్పలేమని, విచారణ పూర్తయిన తరువాత ప్రభుత్వానికి నివేదిక అందిస్తామంటూ ముక్తసరిగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే గుంటూరే కాకుండా రాష్ట్రంలో అనేక జిల్లా ట్రెజరీ కార్యాలయాల్లో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ సంక్షేమ శాఖలు విడుదల చేసిన విద్యార్థుల ఉపకార వేతనాల చెల్లింపులో భారీగా అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది. అయితే సిబ్బంది తమ తప్పిదాలను కప్పి పుచ్చుకోటానికి గతంలో స్వాహా చేసిన మొత్తాన్ని, ప్రస్తుతం సంబంధిత విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. సర్వర్‌లు పనిచేయకపోవటం, ఇతరత్రా సాంకేతిక కారణాలతో బ్యాంక్‌లు విద్యార్థుల స్కాలర్‌ప్‌లకు సంబంధించిన బిల్లులను ఆమోదిస్తూ తిరిగి ట్రెజరీలకు ఇ-చెక్‌లు పంపటం వల్లనే అక్రమాలకు మార్గం ఏర్పడింది. పలు ట్రెజరీ కార్యాలయాల్లో సిబ్బంది తెలివిగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాలకు సొమ్ము జమచేయకుండా తమ వద్దనే ఉంచుకుంటున్నారు. విద్యార్థులు లేదా సంబంధిత విద్యాసంస్థల సిబ్బంది ఎవరైనా వచ్చి అడిగినప్పుడు వారి బ్యాంక్ ఖాతాల స్టేటస్ రిపోర్టు తెచ్చుకొని చూసుకోమంటూ కొద్దిరోజులు, పరిశీలిస్తామని మరికొన్ని రోజులు కాలయాపన చేస్తూ ప్రతి 20 మందిలో ఒకరి సొమ్మును తమ తమ సొంత ఖాతాలకు మళ్లించుకోసాగారు. వాస్తవానికి ఆన్‌లైన్ పాస్‌వర్డ్ నెంబర్ ట్రెజరీ అధికారితో పాటు మరో ఉద్యోగికి మాత్రమే తెలుస్తుంది. తన కార్యాలయంలో ఏమి జరుగుతుందో ట్రెజరీ అధికారికి తెలియకుండా ఉండదు. రాష్ట్రంలో తొలిసారిగా తెనాలి సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఒక కోటీ 10 లక్షల రూపాయల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తండ్రి మరణానంతరం ఎల్‌డిసిగా ఆ కార్యాలయంలో చేరిన చిరుద్యోగి పాస్‌వర్డ్ సంపాదించి కోట్లాది రూపాయల నిధులున్న తెనాలి మున్సిపాల్టీకి సంబంధించిన బిల్లుల తాలూకు రెండోసారి కూడా డ్రా చేసి తన బినామీ ఖాతాల్లోకి మళ్లింప చేసుకుని విలాస జీవితం గడుపుతున్న నేపధ్యంలో ఆలస్యంగా ఈ స్కాం వెలుగుచూసింది. అప్పటికే ప్రకాశం, కృష్ణా, నెల్లూరు, తూగో, విజయనగరం జిల్లాల్లో మొత్తం మరో మూడు కోట్ల రూపాయలు పైగా అవినీతి సిబ్బంది ఖాతాలకు మళ్లాయి. ఆ తర్వాత తాజాగా విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల స్కాం తెరపైకి వచ్చింది. ఏది ఏమైనా ముందుగా ట్రెజరీ శాఖల్లో కీలకమైన విభాగాలను ముఖ్యంగా ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.