రాష్ట్రీయం

చెన్నై ఎగ్మూర్-శాంత్రగచ్చి మధ్య నేటి నుంచి ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 10: ప్రయాణికుల సౌకర్యార్థం ఈనెల 11 నుంచి చెన్నై ఎగ్మూర్-శాంత్రగచ్చి మధ్య ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. ట్రైన్ నెం. 06078 చెన్నై ఎగ్‌మోర్ ప్రత్యేక రైలు ఆదివారం రా.గం. 23:35లకు బయలుదేరి మరుసటి రోజు ఉ.గం. 04:30లకు శాంత్రగచ్చి(కోల్‌కట) చేరుకుంటుందని, ఈ రైలు గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడెపల్లిగూడెం, రాజమండ్రి, సామల్‌కోట్, దువ్వాడ, సింహాచలం నార్త్, విజయనగరం, పలాస, బ్రహ్మపూర్, ఖుర్దారోడ్డు, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలసోర్, ఖరగ్‌పూర్ స్టేషన్లలో ఆగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రత్యేక రైలుకు ప్రత్యేక టికెట్టు ఉంటుందని ఉమాశంకర్‌కుమార్ పేర్కొన్నారు.