రాష్ట్రీయం

మీతోనే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

14 శాతమైనా మీరు సాధించగలరు
కేంద్రాన్ని మించిపోయే పరుగు భేష్
సమస్యలు ఎదుర్కోగలిగే సత్తా మీది
పారిశ్రామిక ప్రగతిలో మహిళలకు చోటు
త్వరలో కేంద్ర పథకం ‘స్టాండప్ ఇండియా’
భాగస్వామ్య సదస్సులో కేంద్ర మంత్రి జైట్లీ

విశాఖపట్నం, జనవరి 10: భారతదేశం రెండంకెల వృద్ధిరేటు సాధించే దిశగా అడుగులు ముందుకేస్తోంది. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్ర రాష్ట్రం రెండంకెల వృద్ధిరేటులో భారత ప్రభుత్వాన్ని మించిపోవాలన్న ఆలోచనతో పరుగులు పెడుతోంది. ఇది శుభపరిణామం. ఆంధ్రప్రదేశ్ 12నుంచి 14శాతం వృద్ధిరేటు సాధించగలిగితే, భారత ప్రభుత్వం ఖాయంగా 10శాతం వృద్ధిరేటు సాధిస్తుంది అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. సిఐఐ ఆధ్వర్యంలో విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సు తొలిరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిఐఐ తరుచూ ఇటువంటి సదస్సులు ఏర్పాటు చేస్తుంటుంది. వాటికి నేను హాజరవుతున్నాను. ప్రధాని మోదీ పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలుగా సహకారిస్తున్నారని జైట్లీ అన్నారు. పారిశ్రామిక రంగంలో పోటీ తత్వం పెరిగిపోయిందన్నారు. ఇందుకు అనుగుణంగా భారత ప్రభుత్వం అనేక రాయితీలు, సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. అయితే వచ్చిన పారిశ్రామికవేత్తలంతా పెట్టుబడులు ఎక్కడ పెట్టాలన్న ఆలోచనలో ఉంటున్నారని జైట్లీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల పారిశ్రామిక విధానాలు, రాష్ట్రంలో ఉన్న మెరుగైన అవకాశాలను పారిశ్రామికవేత్తలు పరిగణలోకి తీసుకుంటారని ఆయన చెప్పారు. కంపెనీని విస్తరించాల్సి వస్తే ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఉండాలని కూడా ఆలోచిస్తుందని, వీటన్నింటికీ అనువైన ప్రదేశం ఆంధ్రప్రదేశ్ అని జైట్లీ చెప్పారు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన, సాహసోపేతమైన ప్రాజెక్ట్‌ల నిర్మాణాలు చేపట్టడంలో తెలుగువారు ముందుంటారని కితాబునిచ్చారు. ఏపీలోని ప్రజా ప్రతినిధుల్లో చాలామంది పెట్టుబడిదారులు ఉన్నారని జైట్లీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ గణనీయమైన ప్రగతి సాధించడానికి నిరంతరం కృషి జరుగుతోందన్నారు. వీటికిమించి చంద్రబాబు పటిష్ట నాయకత్వ పటిమ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతుందన్నారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పలు సమస్యలను ఎదుర్కొంటోన్న విషయం వాస్తవమేనని జైట్లీ అంగీకరించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు చంద్రబాబు శ్రమిస్తున్నారని జైట్లీ చెప్పారు. విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను అమలు చేయడంతో పాటు సమస్యల నుంచి బయటపడి, ఆర్థిక పురోభివృద్ధిని సాధించేందుకు కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఆర్థికలోటును ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ 11 శాతం వృద్ధి రేటును సాధించడం అభినందనీయమని, సమస్యలను అధిగమించి అభివృద్ధి పథంలో పయనిస్తే అగ్రగామిగా ఎదగడం ఖాయమన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వ పటిమపై నమ్మకంతోనే ప్రజలు గెలిపించారని, ఆయనలో దార్శనికునికే ప్రజలు ఓటేశారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అత్యుత్తమ స్థాయి రాజధానిని నిర్మించాలన్న పట్టుదలతో చంద్రబాబు పనిచేస్తున్నారని కొనియాడారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత నయా రాయ్‌పూర్, ఢిల్లీ పట్టణాలు మాత్రమే అభివృద్ధి చెందాయని, వీటన్నింటినీ మించి ఆంధ్ర రాజధాని అమరావతి అంతర్జాతీయస్థాయి నగరంగా అభివృద్ధి సాధిస్తుందన్న నమ్మకం తనకుందని జైట్లీ అన్నారు.
చిత్రం..
భాగస్వామ్య సదస్సు వేదికపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి రాష్ట్ర పరిస్థితిని వివరిస్తున్న సిఎం చంద్రబాబు