రాష్ట్రీయం

సెమీ అటానమి దిశగా టి మెడికల్ కాలేజీలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ప్రారంభమవుతున్న మెడికల్ కాలేజీలు సెమీ అటానమస్ దిశలో వెళుతున్నాయి. దీనిపై విద్యార్థిలోకంతో పాటు, బోధన, బోధనేతర సిబ్బంది నుండి వ్యతిరేకత కూడా వస్తోంది. ప్రస్తు తం రాష్ట్రంలో ఉస్మానియా మెడికల్ కాలేజీ (హైదరాబాద్), గాంధీ మెడికల్ కాలేజీ (హైదరాబాద్), కాకతీయ మెడికల్ కాలేజీ (వరంగల్), నిజామాబాద్ మెడికల్ కాలేజీ ప్రభుత్వ అధీనంలో నడుస్తున్నాయి. ఆదిలాబాద్‌లో 2006 లోనే రిమ్స్ (రాజీవ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్) సెమీ అటానమస్‌గా ప్రారంభమైంది. మారిన పరిస్థితిలో రిమ్స్ ఆదిలాబాద్ అనేక కష్టాల్లో కూరుకుపోయి ఉంది. ఇలా ఉండగా తెలంగాణలోని ప్రతి జిల్లాలో (పాత జిల్లాలు) ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఈ ప్రకటనలో భాగంగా మొట్టమొదట మహబూబ్‌నగర్‌లో మెడికల్ కాలేజీని ప్రారంభించారు. దీన్ని ప్రారంభించేందుకు వైద్య శాఖ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. గత ఏడాది 150 మంది విద్యార్థులను ఎంబిబిఎస్ కోర్సులో చేర్చుకోవడంతో తొలిబ్యాచ్ ప్రారంభమైంది. ఈ సంవత్సరం రెండో బ్యాచ్‌ని చేర్చుకుంటున్నారు. ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజీగానే ప్రారంభమైనప్పటికీ, దీన్ని సెమీ అటానమస్‌గా ఇటీవలే మార్పు చేశారు. వాస్తవంగా సెమీ అటానమస్ కాలేజీలు విఫలం (ఫెయిల్యూర్) అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రం గా ఉండగా ఆదిలాబాద్‌తో పాటు శ్రీకాకుళం, ఒం గోలు, కడపలో కూడా రిమ్స్ ఏర్పాటు చేశారు.