రాష్ట్రీయం

వనజీవి రామయ్యకు గుండెపోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం/హైదరాబాద్, జూన్ 12: పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనజీవి రామయ్యగా పేరుగాంచిన దరిపల్లి రామయ్య సోమవారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఇటీవల పద్మశ్రీ అవార్డు తీసుకున్న ఆయనకు ఆదివారం రాత్రి తీవ్ర గుండెపోటు రావటంతో ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతుండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.
రామయ్య ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. మూడు దశాబ్దాలుగా కోటికి పైగా మొక్కలు నాటిన ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.కాగా అనారోగ్యంతో బాధ పడుతున్న పద్మశ్రీ అవార్డు గ్రహిత దరిపెల్లి రాములుకు పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లాకు చెందిన దరిపెల్లి రాములు తీవ్ర అస్వస్థతకు గురైనట్టు సమాచారం అందగానే సిఎంఓ అధికారులను ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు. సిఎంఓ అధికారులు ఖమ్మం జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి రాములుకు మెరుగైన వైద్యం అందించడానికి హైదరాబాద్‌కు తరలించడానికి ఏర్పాట్లు చేశారు.

చిత్రం.. హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామయ్య