రాష్ట్రీయం

రైళ్లు, బస్సులు కిటకిట చార్జీల మోతతో కటకట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 10: సంక్రాం తి రద్దీ ప్రారంభమైంది. హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయాణాలు మొదలు పెట్టారు. అన్ని రైళ్లలో రిజర్వేన్లు ఫుల్. ప్రత్యేక రైళ్లు, అదనపు బోగీలు, అదనపు సీట్లు కూడా అన్నీ ఫుల్. కృష్ణా, సికింద్రాబాద్- గుంటూరు ఇంటర్‌సిటీ, శాతవాహన, జన్మభూమి, గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లు వంటి పగలు నడిచే సెకండ్ సీటింగ్ రైళ్లలోనూ ఒక్క సీటు కూడా దొరకని పరిస్థితి. ఇక స్లీపర్ తరగతిలో ఒక్క బెర్తు కూడా దొరకని పరిస్థితి. వెయిటింగ్ లిస్ట్ భారీగా పెరిగిపోయింది. వందల సంఖ్యలో అదనంగా ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు టిఎస్‌ఆర్టీసి, ఎపిఎస్‌ఆర్టీసి ప్రకటించాయి. రెండూ కలిసి హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ముఖ్యమైన గమ్యస్థానాలకు దాదాపు ఆరువేల బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించాయి. ఇందుకు తగిన ఏర్పాట్లు చేశాయి. అయితే ఆర్టీసి రెగ్యులర్‌గా నడిపే సూపర్‌లగ్జరీ బస్సులన్నింటికీ రెండు నెలల కిందటే టిక్కెట్లన్నీ బుక్ అయిపోయాయి. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులుగా ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులను వందల సంఖ్యలో ఆర్టీసి నడుపుతోంది. వీటికి ప్రస్తుతం ఉన్న చార్జీకి అదనంగా 50 శాతం వసూలు చేస్తోంది. ప్రత్యేక సర్వీసులకు అదనంగా 50 శాతం చార్జీ వసూలు చేయడమనేది తప్పనిసరి అని స్వయంగా ఎపిఎస్‌ఆర్టీసి ఎండి వెల్లడించారు. సగటు ప్రయాణికుడికి ఆర్టీసి ప్రయా ణం కూడా భారంగానే మారింది. గతిలేని పరిస్థితిలో కిక్కిరిసిన రైళ్లనే ఆశ్రయించకతప్పడం లేదు. ప్రైవేటు బస్సుల దందా గురించి ఇక చెప్పనక్లర్లేదు. పండుగ సీజన్ కోసం వేచి చూస్తున్న ప్రైవేటు బస్సు ఆపరేటర్లు అవసరాన్ని బట్టి చార్జీలు పెంచుతున్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి నియంత్రణ లేదు. ప్రైవేటు బస్సులపై నిఘా ప్రభుత్వ నిఘా కొరవడింది. విశాఖ, తిరుపతి, విజయనగరం వంటి దూరప్రాంతాలకు ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు ఆన్‌లైన్‌లో ఉంచిన రేట్లు చూస్తే దిమ్మదిరిగిపోతున్నాయి. ఆ చార్జీలకు వెయ్యో, పదిహేను వందలో కలిపితే ఢిల్లీ, ముంబయి విమాన చార్జీతో సరిపోతోంది. లగ్జరీ బస్సులు నడిపే ప్రైవేటు బస్సు ఆపరేటర్లంతా తమతమ బస్సు చార్జీల వివరాలను ఇప్పటికే ఆన్‌లైన్లో ఉంచడంతో ప్రయాణికులు అవసరం మేరకు బుక్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు ఆర్టీసి బస్సు చార్జీ గరుడకు రూ.1055 వరకు చార్జీ వసూలు చేస్తుంటే, సూపర్ లగ్జరీకి రూ.756 వసూలు చేస్తోంది. ఇక ప్రైవేట్ మల్టీయాక్సిల్ స్లీపర్ బస్సుకు హైదరాబాద్ నుంచి విశాపట్నం రూ.2,200 వరకు వసూలు చేస్తుండగా, నాన్ ఏసి బస్సుకి రూ.1500 నుంచి 1700 వరకు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఆర్టీసి గరుడ బస్సుకు చార్జీ రూ.417, డీలక్స్ బస్సుకు రూ.276, సూపర్ లగ్జరీకి రూ.317 వసూలు చేస్తున్నారు. ఇక విజయవాడకు ప్రైవేటు ఆపరేటర్లు ఎసి స్లీపర్ చార్జి రూ.1000కిపైగానే వసూలు చేస్తుండగా, నాన్ ఏసి హైటెక్ సర్వీస్‌కు రూ.800 నుంచి వెయ్యి వరకు ఆయా బస్సు కొత్తదనాన్ని బట్టి వసూలు చేస్తున్నారు. మల్టీయాక్సిల్ మెర్సిడీజ్ బెంజ్ వంటి అధునాతన బస్సులో స్లీపర్‌కి రూ.2250 వరకు వసూలు చేస్తున్నట్లు ఆన్‌లైన్‌లో వివరాలను ఆయా ఆపరేటర్లు అందుబాటులో ఉంచారు.
తిరుపతికి ప్రైవేటు ఆపరేటర్లు ఓల్వా సెమీ స్లీపర్‌కు రూ.1200 వరకు, నాన్ ఎసి సర్వీస్‌కు రూ.1050 వరకు, ఎసి సెమి స్లీపర్‌లో కొన్ని పేరొందిన ట్రావెల్ కంపెనీలు రూ.1950 వరకు కూడా వసూలు చేస్తున్నారు. రాజమండ్రికి ఆర్టీసి గరుడ రూ.707 వసూలు చేస్తుంటే అదనపు చార్జీతో ప్రత్యేక బస్సు ఎక్స్‌ప్రెస్ కేటగిరిలో రూ.559 వసూలు చేస్తున్నారు. సూపర్ లగ్జరీ రెగ్యులర్ సర్వీస్‌కు రూ.511 చార్జి ఉంది. కానీ ఒక్క బస్సులో ఒక్క సీటు కూడా లేదు. రాజమండ్రి వరకు ప్రైవేటు బస్సుల్లో టిక్కెట్ల ధరలు ఆకాశాన్నంటాయి. ఎసి స్లీపర్ 1900కి పైగానే ఉండగా నాన్ ఎసి రూ.999, ఎసి స్లీపర్ రూ.2200, నాన్ ఎసి స్లీపర్ రూ.1111 వరకు ఆయా బస్సు లగ్జరీని బట్టి వసూలు చేస్తున్నారు. పండుగ దగ్గరకు వచ్చేసరికి ఈ చార్జీలు ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.