రాష్ట్రీయం

దళితుడే సిఎం అన్నదీ జోకేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 10: ‘తెలంగాణ తొలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తామన్న హామీ కూడా జోక్‌గానే చెప్పారా?’ అని బిజెపి శాసనసభాపక్షం నాయకుడు డాక్టర్ కె.లక్ష్మణ్ రాష్ట్ర మంత్రి కె.తారక రామారావును ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ అంటే తెలుగు రాష్ట్ర సమితిగా మారుస్తామని, తాను భీమవరం నుంచి పోటీ చేస్తానని జోక్‌గా అన్నానని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించడంపై డాక్టర్ లక్ష్మణ్ ఆదివారం విలేఖరుల సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు. అలాగైతే ఎన్నికలకు ముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ జోక్‌లేనా? అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ లోగడ ఎంపీగా ఉన్నప్పుడు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని సార్లు పార్లమెంటుకు వెళ్ళారని, ఎన్ని సార్లు ఇతర రాష్ట్రాలకు వెళ్ళారని, ఎన్ని సార్లు జిల్లాల్లో పర్యటించారని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 12న టిడిపి-బిజెపి సంయుక్తంగా హైదరాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సభకు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు ఎం.వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథులుగా హాజరవుతారని ఆయన తెలిపారు.

పలువురు కేంద్ర మంత్రులు కూడా ప్రచారానికి రానున్నట్లు ఆయన చెప్పారు. 28, 29, 30 తేదీల్లో రోడ్-షోలు నిర్వహించనున్నట్లు డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు.

నకిలీ సర్ట్ఫికెట్ల
గుట్టు రట్టు
ౄ ఒకరి అరెస్టు, కంప్యూటర్, ప్రింటర్, స్కానర్ స్వాధీనం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 10: రాజధానిలో నకిలీ సర్ట్ఫికెట్ల ముఠా గుట్టు రట్టయింది. ఉస్మానియా, జెఎన్‌టియు విశ్వవిద్యాలయాలకు చెందిన నకిలీ సర్ట్ఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంప్యూటర్, ప్రింటర్, స్కానర్‌లతోపాటు హోలోగ్రామ్‌లు, రూ. 1100 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ బి లింబారెడ్డి వెల్లడించిన వివరాలిలావున్నాయి. బోరబండకు చెందిన టి విశాల్ (34) అమీర్‌పేట్‌లో జెన్‌సాఫ్ట్ కంపెనీలో నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నాడు. 2008లో కంపెనీ మూతపడడంతో విజన్ నెట్ పేరుతో ఇంటర్నెట్ కేంద్రాన్ని మొదలు పెట్టాడు. వ్యాపారం సక్రమంగా నడవకపోవడంతో నకిలీ సర్ట్ఫికెట్లు తయారు చేసి అమ్మడం మొదలుపెట్టాడు. పదోతరగతి, ఇంటర్మీడియట్, ఓయ, జెఎన్‌టియుకు చెందిన డిగ్రీ సర్ట్ఫికెట్లు కూడా తయారు చేసి ఒక్కో సర్ట్ఫికెట్‌ను రూ. 5000ల నుంచి 8000 వరకు విక్రయిస్తున్నాడు. దాదాపుగా వంద మందికి ఈ నకిలీ సర్ట్ఫికెట్లను అమ్మినట్టు విచారణలో తేలింది. నిందితుడిని అరెస్టు చేసి అతని నుంచి నకిలీ సర్ట్ఫికెట్లు, 22హోలోగ్రామ్స్, ఐదు సెల్ ఫోన్లు, రూ. 1100లు నగదు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు.

రెండు నాల్కల ధోరణి

టిఆర్‌ఎస్‌పై లోకేశ్ ధ్వజం

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 10: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల నేపథ్యంలో పార్టీల నాయకుల పరస్పర విమర్శలు, ఆరోపణలు జోరుగా సాగుతున్నాయి. టిఆర్‌ఎస్ ఎంపి కవిత శనివారం ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ సినీ నటుడు పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి మేకప్-ప్యాకప్ అని పరోక్షంగా విమర్శించిన సంగతి తెలిసిందే. మేకప్‌తో వస్తారని ప్యాకప్‌తో వెళతారని ఆమె దుయ్యబట్టగా, ఆదివారం టిడిపి యువ నాయకుడు నారా లోకేశ్ ఒక అడుగు ముందుకేసి ట్విట్టర్‌లో టిఆర్‌ఎస్‌ను తూర్పారబట్టారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న సెటిలర్ల విషయంలో టిఆర్‌ఎస్ రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తున్నదని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు సెటిలర్లను అనేక రకాలుగా భయాందోళనకు గురి చేసి, ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో వారిని మచ్చిక చేసుకోవడానికి సానుభూతి వ్యక్తం చేస్తున్నారని ఆయన విమర్శించారు. సెటిలర్ల భద్రత తమదేనని, వారికి ఏ కష్టం రాకుండా చూసుకుంటామని టిఆర్‌ఎస్ నాయకులు ప్రేమ ఒలకబోస్తున్నారని లోకేశ్ ట్వీట్ చేశారు.