రాష్ట్రీయం

రైతుకు ధీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 17: రాష్ట్రంలోని ఏడు జిల్లాల రైతాంగానికి శుభవార్త. చాలాకాలం నుంచి రైతులు ఎదురుచూస్తున్న ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా చెల్లింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలకు తెరదింపేందుకు మొత్తం 1680కోట్లతో ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. శనివారం తన నివాసంలో జరిగిన అనంతపురం జిల్లా టిడిపి సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో కలసి ఇన్‌పుట్ సబ్సిడీ, పంట రుణాలపైనే చర్చించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ 2016 సంవత్సరానికి గాను ఏడు జిల్లాల పరిధిలో రు.1680కోట్ల రూపాయల ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించామని, అందులో సగం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు.
వీటిని వారి ఆధార్ అనుంధారిత అకౌంట్లలో జమచేస్తామన్నారు. వారం రోజుల్లోగా ఈ మొత్తాన్ని ఎట్టి పరిస్థితిలోనూ అందించాలని ఆదేశించారు. ఈ వ్యవహారం అంతా పారదర్శకంగా జరగాలని స్పష్టం చేశారు. 19వ తేదీ నుంచి 25వరకూ ఆయా రైతులకు వీటిని అందుకున్నట్లుగా ధ్రువీకరణ పత్రాలను అందించాలని ఆదేశించారు.
శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోని 12,07,156.41 హెక్టార్లకు చెందిన 13,21212 మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందుతుందని బాబు వివరించారు. అనంతపురం జిల్లాకు రు.1032 కోట్లు, కర్నూలుకు 325 కోట్లు, చిత్తూరుకు రు.163 కోట్లు, కడపకు రు.77 కోట్లు, శ్రీకాకుళానికి రు. 6.55 కోట్లు, ప్రకాశం జిల్లాకు రు.72 కోట్లు, నెల్లూరు జిల్లాకు 3.81 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా పంటల బీమా పథకం కింద రు. 534 కోట్ల రూపాయలు ఇవ్వనున్నామని బాబు చెప్పారు. కాగా, ఇప్పటికే మూడు జిల్లాల్లో వీటిని ఇస్తుండగా, సోమ, మంగళ వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక భారీ కార్యక్రమం నిర్వహించి ఆ వేదిక మీదనే వీటిటి అందచేయాలని నిర్ణయించారు. మంత్రి కాలువ శ్రీనివాసులు, దేవినేని ఉమ, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, వ్యవసాయశాఖ కమిషనర్ హరి జవహర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, సీఎం అదనపు కార్యదర్శి రాజవౌళి పాల్గొన్నారు.
ఇది దక్షిణభారతంలోనే ఓ చరిత్ర: సోమిరెడ్డి
‘మన రాష్ట్రం దక్షిణ భారత దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఆర్థికంగా వెనుకబడి ఉంది. కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, పక్కనే ధనిక రాష్టమ్రైన తెలంగాణ కంటే మన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బలహీనంగా ఉంది. అయినా రైతులను ఆదుకోవడంలో వారందరికంటే మనమే ముందున్నాం. ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమాలో అన్ని రాష్ట్రాల కంటే మనమే రైతులను ఆదుకోవడంలో ముందున్నాం. ఇది రైతుల పట్ల మా పార్టీకి, చంద్రబాబునాయుడికి ఉన్న చిత్తశుద్ధి’ అని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మీడియాకు చెప్పారు. చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాలు రైతులపై వల్లమాలిన ప్రేమ చూపిస్తున్న విపక్షాలకు కనువిప్పు కావాలన్నారు. ఈ నిర్ణయం వల్ల ఒక్క అనంతపురం జిల్లా రైతులకే 2210 కోట్ల రూపాయల లబ్ధి జరుగుతుందని, ఇది రైతులను ఆదుకోవడం కాదా.. అని ఆయన వైసీపీని నిలదీశారు. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎప్పుడూ ఇలాంటి చారిత్రక నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు లేవని, వ్యవసాయం గురించి తెలియని జగన్, మేఘమథనంలో నిధులు స్వాహా చేసిన రఘువీరారెడ్డి కూడా కూడా రైతుల గురించి మట్లాడటం వింతగా ఉందని విరుచుకుపడ్డారు. రైతుల సంక్షేమం కోసం చంద్రబాబునాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా లెక్కచేయకుండా తీసుకుంటున్న నిర్ణయాలు రైతాంగం అర్థం చేసుకుని, ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్న విపక్షాలపై తిరుగుబాటు చేయాలని సోమిరెడ్డి పిలుపునిచ్చారు.