రాష్ట్రీయం

బ్రహ్మానందరెడ్డికి పచ్చజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 17: ఎట్టకేలకు నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి పేరును టిడిపి నాయకత్వం ఖరారు చేసింది. శనివారం రాత్రి వరకూ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన కర్నూలు జిల్లా పార్టీ నేతల సమావేశంలో, పార్టీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి పేరును బాబు ఖరారు చేశారు. కాగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సోమిశెట్టి వెంకటేశ్వర్లును నియమించేందుకు నేతలు అంగీకరించినట్లు సమాచారం.
అంతకుముందు.. మంత్రి అఖిల ప్రియ, స్థానిక నేత ఎవి సుబ్బారెడ్డి, ఎంపి ఎస్పీవై రెడ్డి, ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డితో బాబు విడిగా మాట్లాడారు. ఈ సందర్భంగా తాను సుబ్బారెడ్డితో సర్దుకుపోతానని అఖిల హామీ ఇవ్వగా, సుబ్బారెడ్డి కూడా టికెట్ ఎవరికి ఇచ్చినా పనిచేస్తానని చెప్పటంతో బ్రహ్మానందరెడ్డికి లైన్‌క్లియరయింది. శిల్పా పార్టీని వీడినా నష్టమేమీ లేదని, కసితో పనిచేసి పార్టీ అభ్యర్థిని గెలిపించాలని బాబు ఆదేశించారు. ఉపఎన్నిక ఇన్చార్జ్‌లుగా మంత్రులు నారాయణ, కాలువ శ్రీనివాసులును నియమిస్తున్నట్లు ప్రకటించారు. అటు చక్రపాణిరెడ్డి.. ఎమ్మెల్యే ఎస్‌వి మోహన్‌రెడ్డిపై బాబుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గతంలో శిల్పాను ఎలాంటి కార్యక్రమాలకు పిలవకూడదని మోహన్‌రెడ్డే అఖిలకు సూచించారని, అసలు వివాదం అక్కడి నుంచే మొదలయిందని ఆయన ఫిర్యాదు చేశారు. శిల్పా పార్టీ వీడినా అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దానితో బాబు మోహన్‌రెడ్డిని మందలించినట్లు తెలిసింది. ఆ అమ్మాయిని ఏవిధంగా బలోపేతం చేయాలో చూడాలే తప్ప, మీ వర్గరాజకీయాలను రుద్దడం మంచిది కాదు కదా.. అని అన్నట్టు సమాచారం.
అఖిలకూ క్లాసు తీసుకున్నట్లు సమాచారం. చిన్న వయసులో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని,
నియోజకవర్గంలో అందరినీ సమన్వయం చేసుకోవాలని, మీ సోదరుడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత నీపైనే ఉందని బాబు స్పష్టం చేశారు. మంత్రి పీఏ పనితీరుపై వస్తున్న ఫిర్యాదులు, కుటుంబసభ్యుల పెత్తనంపై వస్తున్న ఆరోపణలను కూడా దృష్టిలో పెట్టుకుని మాట్లాడిన బాబు.. రాజకీయాల్లో ఉన్నప్పుడు అందరినీ సమన్వయం చేసుకోవాలని, ప్రధానంగా ఎవి సుబ్బారెడ్డిని దూరం చేసుకుంటే నష్టపోతావని సూచించినట్లు సమాచారం. కాగా, పార్టీ అభ్యర్థిగా భూమా నాగిరెడ్డి సోదరుడి కుమారుడైన భూమా బ్రహ్మానందరెడ్డికి పార్టీ టికెట్ ఇస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, మంత్రి కాలువ శ్రీనివాసులు మీడియాకు తెలిపారు.

చిత్రం.. భూమా బ్రహ్మానందరెడ్డి