రాష్ట్రీయం

రెవిన్యూ శాఖలో 2506 పోస్టుల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 17: రెవిన్యూ శాఖలో డైరెక్టు రిక్రూట్‌మెంట్ ద్వారా 137 కొత్త పోస్టుల భర్తీకి పబ్లిక్ సర్వీసు కమిషన్‌ను ఆదేశించిన ప్రభుత్వం తాజాగా మరో 2506 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చీఫ్ కమిషనర్ ల్యాండ్ రెవిన్యూలో 13 సీనియర్ స్టెనోలు, 109 జూనియర్ అసిస్టెంట్‌లు, 15 జూనియర్ స్టెనోల భర్తీకి ప్రభుత్వం జీవో 102ను జారీ చేసింది. రెవిన్యూ శాఖలో మరో 2506 పోస్టుల భర్తీకి సిఎం కెసిఆర్ శనివారంనాడు ఆమోదముద్ర వేశారు. ఉద్యోగ నియామక ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌పి సింగ్‌ను సిఎం ఆదేశించారు. సిసిఎల్‌ఎలో 21 జూనియర్ అసిస్టెంట్లు, 8 డిప్యూటీ కలెక్టర్లు, 38 డిప్యూటీ తహశీల్దార్‌లు, 400 జూనియర్ అసిస్టెంట్లు/టైపిస్టులు, 700 విఆర్‌ఓలు, 1000 విఆర్‌ఎలు, 100డిప్యుటీ సర్వేయర్లు, 50 కంప్యూటర్ డ్రాఫ్ట్‌మన్‌లు, ఏడు జిల్లా రిజిస్ట్రార్లు, 22 సబ్ రిజిస్ట్రార్లు, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో 50 జూనియర్ అసిస్టెంట్లు, 110 సర్వేయర్ పోస్టులు ఉన్నాయి. వీటిని కూడా పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు.