రాష్ట్రీయం

మెడికల్ హబ్‌గా తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, జూన్ 17: తెలంగాణ ప్రపంచంలోనే అత్యుత్తమ మెడికల్ హబ్‌గా మారబోతోందని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ప్రామాణికమైన వైద్య పరికరాల తయారీలో కొత్తగా రూపుదిద్దుకుంటున్న పార్క్ అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువస్తామని ఆయన అన్నారు. రాజధాని శివార్లలోని పటన్‌చెరు సమీపంలో ఏర్పాటు చేయనున్న వైద్య పరికరాల తయారీ పార్కుకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుతో కలిసి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని సాంకేతికత ఎంతమాత్రం అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశయాల మేరకు వైద్య ఉపకరణాల తయారీకి స్థానికంగానే శ్రీకారం చుడుతున్నామన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ నిరుపేదల వైద్యానికి అయ్యే వ్యయాన్ని తగ్గించాలన్నదే లక్ష్యమన్నారు. వైద్యానికి అవసరమవుతున్న పరికరాలను 75శాతం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. వాటిని ఇక్కడే తయారు చేసుకోవడం ద్వారా పేదల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన వ్యయాన్ని భారీగా తగ్గించగలమని ఆయన విశ్వాసం వెలిబుచ్చారు. మెడికల్ డివైజ్ పార్కు కోసం 417ఎకరాలు సేకరించామని, ప్రస్తుతం 250ఎకరాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఇక్కడ ఏర్పాటు చేయబోతున్న పరిశ్రమలలో సింహభాగం ఉద్యోగాలు కేవలం స్థానికులకే ఇవ్వాలని పరిశ్రమల యజమానులకు సూచించారు. స్కిల్డ్, అన్‌స్కిల్డ్ కార్మికులకు అవసరమైన శిక్షణను ప్రభుత్వం ఇస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. 50ఎకరాలలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి 14ప్రముఖ పరిశ్రమల ప్రతినిధులు ముందుకు వచ్చారని, వారితో ఇక్కడే ఎంఓయు కుదుర్చుకుంటామన్నారు. తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా ముందుకు దూసుకుపోతున్న ముఖ్యమంత్రి కెసిఆర్ అందుకు అనుగుణంగా అవసరమైన ప్రణాళిక రూపొందిస్తున్నారన్నారు. వైద్య పరికరాల తయారీ పార్కు ఏర్పాటు చేయడం దేశంలో మొదటిదని ఆయన అన్నారు. కేవలం మూడేళ్లలోనే మన రాష్ట్రానికి దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించిందన్నారు. విద్యుత్ రంగలో విప్లవాత్మకమైన సంస్కరణల ద్వారా పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు నిరంతర కరెంట్ అందిస్తున్న ఘనత కేవలం మన రాష్ట్రానికే దక్కిందన్నారు.
పటాన్ చెరు సమీపంలోని సుల్తాన్‌పూర్ గ్రామ పరిధిలో ఏర్పాటు చేస్తున్న వైద్య పరికరాల తయారీ పార్కు మూలంగా కేవలం ఉపాధి అవకాశాలే కాకుండా చికిత్సలకు అవసరమైన ఉపకరణాలు అతి తక్కువ ధరకు లబిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత పరిశ్రమలు నెలకొల్పడానికి అవసరమైన అనుమతులు అత్యంత వేగంగా లభిస్తున్నాయన్నారు. టిఎస్‌ఐఐసి చైర్మన్ బాలమల్లు మాట్లాడుతూ మెడికల్ డివైజ్ పార్కులో కేవలం 24 మాసాలలోనే ఉత్పత్తులు ప్రారంభించడం జరుగుతుందన్నారు.

చిత్రం.. సుల్తాన్‌పూర్‌లో వైద్య పరికరాల తయారీ పార్కును ప్రారంభిస్తున్న ఐటి శాఖ మంత్రి
తారక రామారావు. చిత్రంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తదితరులు