రాష్ట్రీయం

గాంధీభవన్‌లో న్యాయ సలహా కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 10: విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం గాంధీభవన్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ న్యాయ సలహా కేంద్రం ఏర్పాటు చేసింది. ఆదివారం టి పిసిసి అధికార ప్రతినిధి మధుయాష్కిగౌడ్, ఎన్‌ఆర్‌ఐ సెల్ చైర్మన్ వినోద్‌కుమార్ ఈ న్యాయ సలహా కేంద్రాన్ని ప్రారంభించారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన విద్యార్థులు అర్ధాంతరంగా వెనక్కిరావడం పట్ల వారు విచారం వ్యక్తం చేశారు. సన్నిహితుల ద్వారానో, ట్రావెల్ ఏజెంట్ల ద్వారానో, ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలతోనో అమెరికా వెళ్తున్న విద్యార్థులకు సరైన మార్గదర్శకాలు చేయకపోవడమే ఒక కారణమని, అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో పాలకుల నిర్లక్ష్యం మరో కారణమని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన న్యాయ సలహా కేంద్రం విద్యార్థులకు ఎంతో దోహదపడుతుందన్నారు.
న్యాయ సలహా కేంద్రం ఏర్పాటుతోపాటు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు అవగాహన సదస్సు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా అమెరికాలోని న్యాయ నిపుణుడు షాండిలర్ శర్మ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే విద్యార్థులు ముందుగా ఎక్కడి యూనివర్శిటీలో చదువుకోవాలో ఆ యూనివర్సిటీకి ప్రభుత్వ గుర్తింపు ఉందా? లేదా? అని తెలుసుకోవాలని, వారు కోరే విద్యార్హత, వీసా, ధ్రువీకరణ పత్రాలతోపాటు నిర్ణీత ఫీజును సమర్పించాలని తెలిపారు. విదేశాల్లో చదువుకునే స్తోమత ఉందా? లేదా? వంటి అంశాలను కూడా అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు ప్రశ్నిస్తుంటారని, దానికి తగిన విధంగా సమాధానం ఇవ్వాలని సూచించారు. ఈ సదస్సులో సుమా రు ఐదు వందల మంది విద్యార్థులతో పాటు విద్యాపోషకులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

గాంధీభవన్‌లో జరిగిన విద్యార్థుల సదస్సులో
మాట్లాడుతున్న న్యాయ నిపుణుడు షాండిలర్ శర్మ

విపక్షాలు మాతో పోటీ పడలేవు

ౄ సంక్రాంతికి భీమవరం వెళ్తా
ౄ తెలంగాణ మంత్రి తలసాని

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 10: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విపక్షాలు టిఆర్‌ఎస్‌తో పోటీ పడే పరిస్థితిలో లేవని, అన్ని వర్గాలు టిఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నాయని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కెసిఆర్ మానవత్వం ఉన్న నాయకుడని పేదల సమస్యల పరిష్కారం కోసం తపించే నాయకుడని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆదివారం తలసాని మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి పని చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తోందని, ఆరోగ్య రంగంపై దృష్టిసారించినట్టు చెప్పారు. గ్రేటర్‌లో వంద సీట్లలో విజయం సాధిస్తామని అన్నారు. ప్రజలు టిఆర్‌ఎస్‌తో ఉన్నారని, విపక్షాలు నిరాశా నిస్పృహల్లో మునిగిపోయి వ్యతిరేక ప్రచారం సాగిస్తున్నాయని అన్నారు. గోదావరి నుంచి హైదరాబాద్‌కు నీటిని తరలించి హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చినట్టు తెలిపారు. గత పాలకులు పేదల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేశారని అన్నారు. గత పాలకులు విద్యుత్ కోతలతో కాలం గడిపితే తెలంగాణ ప్రభుత్వం కోతలు లేని విద్యుత్‌ను చూపించిందని, 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. పేదలకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం అమలు చేస్తున్నట్టు చెప్పారు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్పు ఎలా ఉందో, గ్రేటర్ ఎన్నికల్లో అదే విధంగా ఉండబోతోందని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులకు గత పాలకులు శిలాఫలకాలు వేసి వదిలేశారని, వాటి ని టిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి చేస్తోందని అన్నారు.అన్ని మతాల పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు. సంక్రాంతి వేడుకలకు భీమవరం వెళుతున్నట్టు తలసాని తెలిపారు. కోడి పందాలకు కాదు, సంక్రాంతి సంబరాల కోసం వెళుతున్నానని ఆయన అన్నారు.