రాష్ట్రీయం

త్రిశంకుస్వర్గంలో విఆర్ డిఎస్పీలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూన్ 18: రాష్ట్రంలో దాదాపు 38మంది డిఎస్పీలు విఆర్‌లో మగ్గుతున్నారు. ఏడాదికి పైగా పోస్టింగ్ లేక కాలం వెల్లదీస్తూ వీరిలో చాలామంది దయనీయ స్థితిలో జీవనం సాగిస్తున్నారు. కొందరైతే అసలు తాము ప్రభుత్వ ఉద్యోగులమనే విషయమే మరిచిపోయారు. శాపమో, వీరు చేసుకున్న పాపమో తెలీదుగాని, గతంలో ఏ ప్రభుత్వ హాయాంలోనూ ఇంతమంది పోలీసు అధికారులు విఆర్‌లో ఉన్న దాఖలాలు వు. పైగా గతంలోనూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ దుస్థితి చోటు చేసుకోలేదు. కాని ఇప్పుడు రాజకీయ కక్షసాధింపు నేపథ్యంలోనే ఇంతమంది డిఎస్పీలు దీర్ఘకాలం పోస్టింగ్ లేక ఇంటికే పరిమితమైనట్లు తెలుస్తోంది. పైగా జీతాలు లేక అల్లాడుతూ అప్పులపాలవుతున్నారు. ఐపిఎస్, ఇతర పోలీసు అధికారుల బదిలీల నేపథ్యంలో పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న విఆర్‌లోని డిఎస్పీల దీనగాధ ఇప్పుడు తెరమీదికి వచ్చింది. రాష్ట్రంలో పదికి పైగా జిల్లాల ఎస్పీలు టిడిపి అధికారంలోకి వచ్చాక పోస్టింగ్‌ల్లోకి వచ్చిన వారే. రెండున్నరేళ్లు దాటిపోవడంతో వీరి బదిలీ అనివార్యం. అదేవిధంగా కొందరికి ప్రమోషన్లు వచ్చినా పోస్టింగ్ లేక ఉన్న స్థానంలోనే కొనసాగుతున్నారు. వీరితోపాటు ఉన్నతస్థాయిలో కూడా పలువురికి పోస్టింగ్‌లు, మార్పులు జరగాల్సి ఉంది. దీంతో ఐపిఎస్ బదిలీలపై ముఖ్యమంత్రి గత కొద్దిరోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఎట్టకేలకు ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో నేడోరేపో జాబితా వెలువడనుంది. ఈ క్రమంలోనే డిజిపి, ఇంటిలిజెన్స్ చీఫ్‌తో ముఖ్యమంత్రి ఆదివారం సమావేశమయ్యారు. దీంతో తమకు కూడా విఆర్ నుంచి విముక్తి కలుగించండంటూ 38మంది డిఎస్పీలు వేడుకుంటున్నారు. సహజంగా ఒక అధికారి సస్పెన్షన్‌కు గురైతే రెండుమూడు నెలల్లోనే మళ్లీ పోస్టింగ్‌లోకి వస్తుంటారు. సస్పెండ్‌లో ఉన్న కాలంలో సగం జీతం అందుతుంది. కానీ విఆర్‌లో ఉన్నవారికి జీతాలు చెల్లింపు ఉండదు. ఇలా ఏకంగా 38మంది డిఎస్పీలు ప్రస్తుతం విఆర్‌లో కొనసాగుతున్నారు. వీరిలో గరిష్టంగా ఏడాదిన్నర నుంచి పోస్టింగ్ లేక జీతం లేక భార్య బంగారం, ఇతరత్రా తాకట్టు పెట్టుకుని బతుకుతున్నవారు ఉన్నారు. విఆర్‌లో ఉన్నవారిలో ఐదురాగురు అదనపు ఎస్పీ క్యాడర్‌లో ఉన్నారు. ఇక గ్రూప్-1 అధికారులూ లేకపోలేదు. తెలంగాణ నుంచి ఏపికి వచ్చినవారూ పోస్టింగ్ లేకుండా ఉన్నారు. ఇంకా కొందరైతే తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసినా ఇక్కడ పరిస్థితికి భయపడి అక్కడి నుంచి రిలీవ్ కాకుండా ఉండిపోయారంటే దుస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆసక్తికర విషయమేమిటంటే ఇండియన్ పోలీసు మెడల్ పొందిన ఓ డిఎస్పీ కూడా జీతం లేక ఆటోలో తిరగాల్సిన దుస్థితి నెలకొంది. సహజంగా డిఎస్పీ స్థాయి అధికారికి జీతభత్యాలతో పాటు వాహనం, డ్రైవర్, ఓ హోంగార్డు, ఆర్డర్లీ, తదితర సౌకర్యాలు ఉంటాయి. విఆర్‌లో మగ్గుతున్న వీరికి ప్రస్తుతం ఇవేమీ లేవు. ఏపిలో ప్రస్తుతం విఆర్‌లో ఉన్న దాదాపు ఈ 38 మంది డిఎస్పీలకు రాజకీయ అండదండలు లేకపోవడమే వీరి దీనస్థితికి ఒక కారణమని పోలీసు వర్గాలే అంటున్నాయి. పైగా గత ప్రభుత్వ హయాంలో మంచి పోస్టింగ్‌లు చేసిన వీరందరూ ఇప్పుడు దీర్ఘకాలంగా పక్కన పెట్టేయడం వెనుక కుల, మత, సామాజిక, ప్రాంతీయ పక్షపాత వైఖరి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.