రాష్ట్రీయం

తీర్పు వచ్చాకే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: హైకోర్టు విభజన అంశం కేంద్రం పరిథి నుంచి కోర్టులోకి వెళ్లిందని కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి పిపి చౌదరి అన్నారు. హైకోర్టుకు త్వరలో ఆరుగురు న్యాయమూర్తులను నియమించనున్నట్టు చెప్పారు. తెలంగాణ బిజెపి న్యాయవాదుల విభాగం ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశానికి కేంద్ర మంత్రి పిపి చౌదరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హైకోర్టు విభజన అంశంపై కోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయన్నారు. రెండు రాష్ట్రాల పిటీషనే్లకాకుండా మరో ప్రైవేటు పిటిషన్ కూడా దాఖలైందని చెప్పారు. తీర్పురాగానే అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కలిసి తమకు నివేదిక అందిస్తే అందుకు తగినవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే ఏపీలో రాజ్‌భవన్, సచివాలయం, హైకోర్టు నిర్మాణానికి కేంద్రం ఇదివరకే 500 కోట్ల కేటాయించిందని వివరించారు. హైకోర్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థలం సిద్ధం చేసినట్టు తమకు సమాచారం ఉందన్నారు. తెలుగు రాష్ట్రాలకు ఆరుగురు న్యాయమూర్తులను నియమించనున్నట్టు తెలిపారు. మిగతా నియామకాలకు సంబంధించిన అంశం కొలిజీయం పరిశీలనలో ఉందన్నారు. న్యాయమూర్తుల నియామకాల్లో మహిళలకు అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ ఉందన్నారు. ఈ విషయాన్ని కొలీజియంకు తెలియజేశామని వివరించారు. ఓబిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా న్యాయవాదుల్లో అర్హులైన వారున్నారని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రివర్గంలో న్యాయవాద వృత్తినుంచి వచ్చిన వారున్నారని చెబుతూ, తన గత స్మృతులనూ జ్ఞాపకం చేసుకున్నారు.
ఖాళీగా 37 జడ్జి పోస్టులు: దత్తాత్రేయ
అంతకుముందు జరిగిన బిజెపి న్యాయవాదుల సమావేశంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ రాష్ట్ర హైకోర్టులో 61మంది న్యాయమూర్తులు ఉండాలి, కానీ కేవలం 24మంది మాత్రమే ఉన్నారని అన్నారు. 37మంది న్యాయమూర్తుల స్థానాలు ఖాళీగా ఉన్నాయని, వీటి భర్తీకి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన కేంద్ర మంత్రి పిపి చౌదరిని కోరారు. మహిళలను న్యాయమూర్తులుగా నియమించాలని ఆయన కోరారు. హైకోర్టును విభజించి ఏపీకి వేరు చేయాలని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేంద్రాన్ని తప్పుపడుతున్నారని ఆయన చెప్పారు. ఇద్దరు సిఎంలూ చర్చించి కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాలని సూచించారు. ప్రధాని నరేంద్రమోదీ 1100 పనికిరాని చట్టాలకు చరమగీతం పాడారని ఆయన తెలిపారు. కార్మికశాఖలో ఉన్న 44 చట్టాలను నాలుగుకు కుదించనున్నట్టు ఆయన వివరించారు.