రాష్ట్రీయం

దందాపై సిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూన్ 18: రాష్టవ్య్రాప్తంగా సంచలనం కలిగిస్తున్న విశాఖ భూవివాదంపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. డిఐజి స్థాయి అధికారి నేతృత్వంలో నలుగురు అధికారులతో కూడిన బృందం రంగంలోకి దిగినట్లు డిజిపి నండూరి సాంబశివరావు వెల్లడించారు. ఈ వ్యవహారంలో సుమారు 270 ఎకరాల భూమికి సంబంధించి 25 రికార్డులు ట్యాంపరింగ్ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిందని తెలిపారు. దీనిపై ఇప్పటికే మూడు కేసులు నమోదు కాగా 30 మందిని నిందితులుగా గుర్తించామన్నారు. అయితే ఎక్కడా అక్రమ రిజిస్ట్రేషన్లు జరగలేదని, బాధితులు, ప్రజలు, నాయకులు ఎవరైనా ఇందుకు సంబంధించి ఆధారాలుంటే సిట్, లేదా పోలీసుల దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు. అంతేగాని నిరాధారమైన ఆరోపణలు చేయడం ద్వారా విశాఖకు ఉన్న మంచిపేరును చెడగొట్టవద్దని సూచించారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు సంబంధించి ప్రశ్నపై తీవ్రంగా స్పందించిన డిజిపి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. లేకుంటే చూస్తూ ఊరుకోబోమని చెప్పారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పలు అంశాలపై డిజిపి నండూరి మాట్లాడారు. వారం రోజులుగా సంచలనం రేపుతున్న విశాఖ భూవివాదం విషయంలో ముఖ్యమంత్రి సీరియస్‌గా ఉన్నారన్నారు. దీనివెనుక ఉన్న ఎంతటి వారినైనా వదిలిపెట్టరాదని తమకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారని, వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు సీనియర్ ఐపిఎస్ అధికారి, 2001 బ్యాచ్‌కు చెందిన వినీత్ బ్రిజ్‌లాల్‌ను సిట్ అధికారిగా నియమించినట్లు చెప్పారు. ఈయన సిబిఐలో పనిచేస్తూ ఇక్కడకు వచ్చారని, బ్రిజ్‌లాల్ నేతృత్వంలో విశాఖ జాయింట్ కలెక్టర్ సృజన, ఆర్డీవో లంకా విజయసారథి, మరో డిఎస్పీతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇక తక్షణమే రంగంలోకి దిగుతున్నట్లు చెప్పారు. లోతైన విచారణ చేపట్టి రికార్డుల ట్యాంపరింగ్‌కు పాల్పడి తద్వారా లబ్ధిపొందిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రాథమిక సమాచారం ప్రకారం విశాఖ జిల్లా మధురవాడ, కొమ్మాదిలో కలిపి 265 ఎకరాల ప్రభుత్వ భూమి, మరో ఐదెకరాల ప్రైవేటు భూమికి సంబంధించి 25 రికార్డుల ట్యాంపరింగ్ జరిగినట్లు వెల్లడైందని ఆయన చెప్పారు. కానీ ఇసి పరిశీలిస్తే ప్రభుత్వ భూములుగానే ఉన్నాయని, ట్యాంపరింగ్‌కు పాల్పడినవారు ఇంకా వాటిని రిజిస్ట్రేషన్లు చేయించుకోలేదన్నారు. భూకుంభకోణం ప్రాథమిక దశలోనే బట్టబయలైందన్నారు. భీమిలి, పెందుర్తి పోలీస్టేషన్లలో రూరల్ తహశీల్దారు ఎల్ సుధాకర్‌నాయుడు ఫిర్యాదు మేరకు మూడు కేసులు నమోదయ్యాయని చెపుతూ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించిన 30 మంది నిందితులతో కూడిన జాబితాను డిజిపి నండూరి విడుదల చేశారు.