రాష్ట్రీయం

చార్జీలు తగ్గించి చరిత్ర సృష్టిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 18: విద్యుత్ చార్జీలు తగ్గించి చరిత్ర సృష్టిద్దామని సిఎం చంద్రబాబు సూచించారు. ఆదివారం ఉదయం విద్యుత్ మంత్రి కళావెంకట్రావు, ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అత్యాధునిక సాంకేతిక విధానాలతో కూడిన పాలనా సంస్కరణలు అవసరమని, అవి ప్రజలందరికీ అందాలన్నారు. 1997లో తొలిసారి విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి కేంద్రీకృతమైన విద్యుత్ రంగాన్ని జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌లుగా విభజించామన్నారు. తిరిగి 20ఏళ్ల తర్వాత మరోసారి విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకురావాల్సి వచ్చిందన్నారు. నాణ్యమైన విద్యుత్‌ను తక్కువ రేటుకు అందించాలనే లక్ష్యంతో ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారిస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలో సోలార్, పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేసి గ్రిడ్‌కు అనుసంధానిస్తే సాగుకుపోగా మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అందించవచ్చన్నారు. సామాన్యుడిని కేంద్రంగా చేసుకుని స్వయం విద్యుదుత్పత్తి దిశగా రెండో విడత సంస్కరణలు తేవాలన్నారు. ఇందుకోసం ఐదంచెల వ్యూహాన్ని ప్రకటించారు. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తికి ప్రోత్సాహం, సమర్ధమైన విద్యుత్ వినియోగానికి పటిష్టమైన చర్యలు, సాంకేతిక వాణిజ్య నష్టాల తగ్గింపుకు చర్యలు, ఆధునిక సరళీకృత విధానాల ద్వారా వినియోగదారునికి అత్యుత్తమ సేవలు, ఉత్పత్తి వ్యయం తగ్గంపునకు ప్రణాళికలు అవసరమన్నారు. గతంలో యూనిట్ సోలార్ విద్యుత్ రూ.16 వుండగా 2014 నాటికి రూ. 6.50కు చేరిందని, రెండు రూపాయలకు తగ్గినా ఆశ్చర్యపోవాల్సింది లేదన్నారు. సోలార్ విద్యుత్ ధరలు నింగి నుంచి నేలకు దిగుతాయనే భరోసా ఇచ్చారు. ఈ నెల 21న కర్నూలు జిల్లాలోని వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పర్యవేక్షించనున్నట్లు వివరించారు. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, జెన్కో ఎండి కె విజయానంద్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత గ్రిడ్లకు టెండర్లు ఆహ్వానించామని తెలిపారు.