రాష్ట్రీయం

పట్టణాల్లోనూ ఇక భూసమీకరణే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 10: అమరావతి రాజధాని నిర్మాణానికి అనుసరించి భూసమీకరణ సత్ఫలితాలు ఇవ్వడంతో, ఇక రాష్టమ్రంతా వౌలిక సదుపాయాలు, కర్మాగారాలు, సంస్థ లు నెలకొల్పేందుకు ఇదే మార్గాన్ని అమలు చేయాలని ఎపి రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ పట్టణాలు, శివార్లలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. కాని అవసరమైన భూమిని సేకరించడంలో అవరోధాలు ఎదురవుతున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు అమరావతి భూసమీకరణ నమూనానే పాటించాలనే ప్రభుత్వం భావిస్తోంది. దీని వల్ల అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని, ప్రజలను భాగస్వాములను చేసేందుకు అవకాశం లభిస్తుందని అధికారులు చంద్రబాబుకు నివేదిక ఇచ్చారు. అమరావతిలో 33 వేల ఎకరాలను స్వచ్ఛందంగా రైతుల నుంచి భూమిని సేకరించిన ఘనత రాష్ట్రప్రభుత్వానికి దక్కింది. ఆంధ్ర రాష్ట్ర రాజధానిలో భూసమీకరణకు ప్రత్యేక చట్టం తెచ్చారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ చట్టాన్ని తేనున్నారు. ఈ చట్టం అమలులోకి వస్తే రాష్ట్రప్రభుత్వం అన్ని మున్సిపల్ పట్టణాల్లో భూసమీకరణ విధానాన్ని అమలు చేస్తుంది. ఈ బిల్లును గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టారు. చట్ట రూపం దాల్చిన వెంటనే గెజిట్ నోటిఫై చేయనున్నారు.
అనేక మున్సిపల్ పట్టణాల్లో పారిశ్రామిక పార్కులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. కాని భూములు కొరత, లిటిగేషన్, సరైన చట్టాలు లేనందు వల్ల పరిశ్రమల ఏర్పాటు, వౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టలేకపోతున్నట్లు వౌలిక సదుపాయాల శాఖ నివేదిక ఇచ్చింది. మున్సిపల్ పరిపాలన శాఖ కూడా కొత్త చట్టం అమలు చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్ కరికాల్ వాలవన్ చెప్పారు. భూసమీకరణలోభాగమైన రైతులకు మానిటరీ బెనిఫిట్‌లు ఇవ్వరు. కాని ఈ ప్రక్రియలో భాగస్వాములైన రైతులకు భూములను అభివృద్ధి చేసి వారి వాటాను ఇస్తారు. ప్రస్తుతం అర్బన్ అభివృద్ధి చట్టంలో ఈ నిబంధన లేదు.
విశాఖపట్నం, తిరుపతి నగరాలను మెట్రోపాలిటన్ ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. విజయనగరం జిల్లాలో భోగాపురం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని అభివృద్ధి ప్రభావం ఉత్తరాంధ్ర అంతటా ఉంటుంది. అక్కడ భూమి సేకరణకు చిక్కులు ఎదురవుతున్నాయి. అందుకే భూసమీకరణకు ప్రయత్నం చేయాలని ప్రభుత్వం సంకల్పంతో ఉంది.

గోదావరి బోర్డు సమావేశం 12న

తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల నిర్మాణంపై సమీక్ష

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 10: తెలుగు రాష్ట్రాల్లో గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టులు, ఇతర అంశాలపై ఈ నెల 12వ తేదీన గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఇక్కడ సమావేశమవుతోంది. గోదావరి బోర్డు పరిధిలోకి చేర్చే ప్రాజెక్టులు, బోర్డు పరిధి, నిబంధనల రూపకల్పన తదితర అంశాలపై బోర్డు ఇరు రాష్ట్రాల సాగునీటిపారుదల శాఖాధికారులతో చర్చిస్తారు. ఈ 12వ తేదీన బోర్డు సమావేశంపై బోర్డు కార్యదర్శి సమీర్ చటర్జీ రెండు రాష్ట్రాలకు వర్తమానం పంపారు. పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించి గోదావరి జలాలను కృష్ణా నదికి మళ్లించడంపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వంపై ఫిర్యాదుచేసింది. పట్టిసీమ పోలవరంలో అంతర్భాగమని ఏపి ప్రభుత్వం కేంద్రానికి సమాధానం ఇచ్చిన విషయం విదితమే. కాగా ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్పు అంశాలపై ఏపి ప్రభుత్వం గతంలోనే తెలంగాణ ప్రభుత్వంపై ఫిర్యాదుచేసింది. సీలేరు విద్యుత్ ప్రాజెక్టులో తమ వాటా విద్యుత్ రావాలని తెలంగాణ కోరుతోంది. ఈ విద్యుత్‌ను షెడ్యూలింగ్ చేయడం లేదని తెలంగాణ బోర్డుకు ఫిర్యాదుచేసింది. ఈ అంశాలన్నింటినీ గోదావరి బోర్డు చర్చించనుంది. ఆంధ్ర పరిధిలో గోదావరి నదిపై 12 పథకాలు, తెలంగాణ పరిధిలో ఆరు పథకాలు నిర్మాణం, వివిధ దశల్లో ఉన్నాయి.

శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై
నేడు నిపుణుల కమిటీ భేటీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 10: రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రతిష్టాకరమైన శ్రీశైలం డ్యాం భద్రతకు సంబంధించి 11వ తేదీ సోమవారం బెంగళూరులో జరగనున్న నేషనల్ కమిటీ ఆన్ డ్యాం సేఫ్టీ సదస్సులో సాగునీటి రంగ నిపుణులు చర్చించనున్నారు. ఇటీవల కృష్ణా జలాల బోర్డు సమావేశంలో కూడా శ్రీశైలం డ్యాం భద్రతకు కమిటీని నియమించి, మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించిన విషయం విదితమే.
ఈ నేపథ్యంలో బెంగళూరులో జరగనున్న జాతీయ డ్యాం సేఫ్టీ సదస్సు చేయనున్న సిఫార్సులు ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి. శ్రీశైలం డ్యాం నిర్మించిన తర్వాత తొలిసారిగా 2009లో అత్యధికంగా 24 లక్షల క్యూసెక్కుల నీరు ఈ డ్యాం ద్వారా దిగువ ప్రాంతానికి ప్రవహించాయి. ఈ ప్రాజెక్టు స్పిల్‌వే కెపాసిటీని పెంచాలని గతంలోనే జాతీయ డ్యాం సేఫ్టీ కమిటీ సిఫార్సు చేసింది. డ్యాం వద్ద జియోహైడ్రాలజీ పరిస్థితులు, డ్యాం గట్టిదనం, డ్యాం దిగువన ఉన్న పరిస్థితులను కమిటీ అంచనా వేసింది. శ్రీశైలం డ్యాంను ఇంతవరకు నిపుణుల కమిటీ రెండుసార్లు సందర్శించి అన్ని అంశాలను అధ్యయనం చేసింది. ప్రాజెక్టులోని 6,7 బ్లాక్‌ల వద్ద పునాదులను పటిష్టం చేయాలని, నీరు నిల్వ ఉన్నప్పుడే మరమ్మతు పనులు చేపట్టే టెక్నాలజీని ఉపయోగించాలని కమిటీ సూచించింది. 5 నుంచి 9 వరకు ఉన్న ఐదు బ్లాక్‌లను పటిష్టం చేయాల్సి ఉంది. శ్రీశైలం డ్యాంకు ఊహించిన దాని కంటే ఎక్కువ నీటి ప్రవాహం వస్తే, వరద నీటిని మళ్లించి డ్యాం కింది భాగంలో కలిసే విధంగా చేస్తే బాగుంటుందని కూడా కమిటీ సిఫార్సుల్లో ఉంది. కృష్ణా జలాల బోర్డు డ్యాం భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర జల సంఘానికి లేఖ రాసింది. శ్రీశైలం డ్యాం నుంచి నీటిని పాముల పాడు గ్రామం వద్ద నుంచి కుందూ నదికి మళ్లించాలనే ప్రతిపాదనను ఆంధ్రప్రభుత్వం పరిశీలిస్తోంది. కాగా దీనికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం లభించాల్సి ఉంటుంది.