రాష్ట్రీయం

ప్రధాని వద్దకు ‘ఏకీకృత’ ఫైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: రెండు తెలుగు రాష్ట్రాల్లోని పంచాయతీరాజ్ టీచర్లకు సంబంధించి గత 15 ఏళ్లుగా వివాదాస్పదంగా ఉన్న ఏకీకృత సర్వీసు రూల్స్ దస్త్రం ఎట్టకేలకు ప్రధాని వద్దకు చేరింది. ప్రధాని ఆ దస్త్రంపై సంతకం చేయగానే అందుకు సంబంధించిన చర్యలను హోంశాఖ తీసుకోనుంది. అనంతరం అది రాష్టప్రతి భవన్‌కు వెళ్తుంది. రాష్టప్రతి ఆమోద ముద్ర వేయగానే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో టీచర్లకు ఏకీకృత సర్వీసులు అమలులోకి వస్తాయి. గతంలో ప్రభుత్వ టీచర్లు మాత్రమే ఉండేవారు. తర్వాత కాలంలో డిఎస్సీల ద్వారా పంచాయితీరాజ్ టీచర్ల నియామకం జరిగింది. ప్రభుత్వ టీచర్ల సర్వీసు రూల్స్ పంచాయతీరాజ్ టీచర్లకు వర్తించకపోవడం, ఇరువర్గాల మధ్య వివాదానికి కారణమైంది. పదోన్నతుల్లోనూ వివాదాలు చోటు చేసుకోవడంతో అది కోర్టుల వరకూ వెళ్లింది. ప్రతిసారీ ప్రభుత్వ టీచర్లకు అనుకూలంగా తీర్పులు రావడంతో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు అప్పటి ప్రభుత్వాలు ఇందుకు సంబంధించి శాసనసభలో తీర్మానాలు చేసి ఆర్డినెన్స్‌లు జారీ చేసినా, అవి కూడా చట్టం ముందు నిలవలేదు. 370డిలో సవరణలు చేయనిదే నిలవదని నిర్ణయించడంతో ఇటీవల పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు చొరవ తీసుకుని సుదీర్ఘ సమస్యపై హోంమంత్రి రాజ్‌నాధ్ సింగ్‌తో చర్చించారు. ఆయన సుముఖంగా స్పందించి అందుకు సంబంధించి రికార్డులను తెప్పించుకుని వాటిని ఆమోదించి ప్రధాని ఆమోదం కోసం పంపించారు. ఈమేరకు ప్రధాని కార్యాలయం ఫైలు చేరిన విషయాన్ని ధృవీకరించింది.