రాష్ట్రీయం

నాకెందుకు ఓటెయ్యరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, జూన్ 22: ఓటుకు నోటు ఇవ్వడానికి తాను వ్యతిరేకమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఓటుకు నోటు ఇచ్చేవారు అభివృద్ధిని పట్టించుకోరన్నారు. స్వార్థంతో, ధనార్జనే ధ్యేయంగా చేసే ఇలాంటి పనుల వల్ల ప్రజలకు మేలు జరగదన్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఉదయం నంద్యాల ఆర్ అండ్ బి అతిథి గృహంలో టిడిపి నేతలు, కార్యకర్తలు, ప్రజలతో సిఎం మాట్లాడారు. ఎన్నికల్లో ఓటుకు నోటు ఇచ్చే సంస్కృతి ప్రస్తుతం బాగా పెరిగిపోయిందని, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘నేను తలుచుకుంటే ఓటుకు రూ.5 వేలు ఇవ్వగలను, అప్పుడు టిడిపి అభ్యర్థిని గెలిపిస్తారా.. కానీ దానికి నేను వ్యతిరేకం. అయినా ఓటర్లకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? మీకు ఓటుకు రూ.5వేలు ఇవ్వాలంటే నేను రూ.5లక్షల చొప్పున దోచుకునేందుకు సిద్ధపడాలి కదా’’అని అన్నారు. కానీ ఇది తన నైజం కాదన్నారు. అభివృద్ధి ఫలాలు అందించిన తరువాతే ఓటు అభ్యర్థిస్తున్నానన్నారు. రేషన్ తీసుకుంటున్నారు, పెన్షన్లు అందుతున్నాయి, నేను వేసిన రోడ్ల మీద నడుస్తున్నారు, విద్యుత్ దీపాల వెలుగులో ఉంటున్నారు, ఇళ్లులేని వారికి లక్షల సంఖ్యలో ఇళ్లు కట్టిస్తున్నాం, ఇంత చేస్తున్నా ఓటు వేయకుంటే ఎలా అని అన్నారు. నా పరిపాలన బాగాలేదంటే స్పష్టంగా చెప్పండి మిమ్ములను ఓటు అడుగను అని అన్నారు. అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా పాటుపడుతున్న నన్ను చూసి ఓటేయండని అభ్యర్థించారు. త్వరలో నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక జరుగనుందని, యువరక్తం రాజకీయాల్లోకి రావడం శుభసూచకమని బాబు అన్నారు. నంద్యాల అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, మంత్రి భూమా అఖిలప్రియ యువకులేనని, తనకంటే ఎక్కువగా కష్టపడేతత్వం వారిదని అన్నారు. భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపిస్తే నంద్యాలను స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి అన్నారు. నిస్వార్థంతో అభివృద్ధికి పాటుపడే తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని ఆయన కోరారు. రాయలసీమలో ఇప్పటికి పెత్తందారి వ్యవస్థ ఉందని, సీమ రాజాకీయాలను ప్రక్షాళన చేయడానికి కొత్తతరం నాయకులను తీసుకువచ్చానన్నారు. తమకంటే యువతరం మరింత ఆశావాహ దృక్పదంతో పనిచేస్తుందన్నారు. రాజకీయంగా ఇతర పార్టీల నుండి నాయకులను అవసరం మేరకు తీసుకువచ్చామని అన్నారు. ఈ ఎన్నికను ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని, గెలవడానికి నాయకుడు కావాలి కాబట్టి కొంత మేరకు రాజీపడ్డామన్నారు. రాజీ పడడం వల్ల టిడిపిలో కొంతమందికి నష్టం కూడా జరిగిందన్నారు. కూర్చున్న చెట్టును నరుక్కుంటామా అని అన్నారు. తనవల్ల లాభం పొందిన వాళ్లంతా నాకు ఓటేయాలని అభ్యర్థించారు. పదేళ్ల క్రితం అధికారం చేతులు మారిందని, అభివృద్ధిని పక్కనపెట్టి దోపిడీ రాజకీయం రాజ్యమేలిందన్నారు. తిరిగి తాను అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేశానన్నారు. సామాజిక పెన్షన్లు రూ.1000కి పెంచి ప్రతి నెలా ఇస్తున్నానన్నారు.
ఈ సందర్భగా స్థానిక నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రితో మాట్లాడుతూ 2004 నుండి తాము రాజకీయ నాయకుల కారణంగా అణిచివేయబడ్డామని, ఇప్పటికైనా మా కష్టాలు తీర్చేందుకు జన్మభూమి కమిటీలను రద్దు చేసి గ్రామాలను అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్, పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ, మాజీ మంత్రి కెఇ ప్రభాకర్, నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.