రాష్ట్రీయం

మిషన్ భగీరథలో 480 పోస్టుల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22:మిషన్ భగీరథ పనులు సత్వరం పూర్తి చేయడం కోసం 480పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పోస్టులకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. క్షేత్ర స్థాయిలో జరిగే పనులను పర్యవేక్షించేందుకు అవసరమైన 480అదనపు ఉద్యోగాలను మంజూరు చేశారు. క్షేత్ర స్థాయిలో ఉండే జూనియర్ అసిస్టెంట్ నుంచి ఇంజనీర్ ఇన్ చీఫ్ వరకు, వివిధ స్థాయిలో ఉండే సిబ్బందిని అవసరమైన మేరకు అదనంగా నియమించుకోవడానికి ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చారు. దీనివల్ల 480అదనపు ఉద్యోగాల కల్పనతో పాటు తెలంగాణలో అదనపు సర్కిల్ కార్యాలయాలను ఎస్‌ఇ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఉండే నూతన సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి. వనపర్తి కేంద్రంలో ఆర్‌డబ్ల్యుయస్ మిషన్ భగీరథకు సంబంధించి సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చారు.