రాష్ట్రీయం

ఉత్సాహంగా అమరావతి మారథాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 10: ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరగబోతున్న నేపథ్యంలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ఆదివారం ఉదయం వివిధ కేటగిరీల్లో జరిగిన అమరావతి మారథాన్ ‘పరుగు’ ఆబాల గోపాలంలో అత్యుత్సాహాన్ని నింపింది. వయస్సుతో నిమిత్తం లేకుండా పరుగులో పాల్గొనటానికి వేల సంఖ్యలో తరలిరాగా, వీరిని చూసేందుకు కొన్నివేల మంది రోడ్లపై ఉదయం నుంచే బారులు తీరారు. వీరంతా కేరింతలతో చప్పట్లు కొడుతూ పరుగులో పాల్గొన్నవారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమానికి ఎక్కడా ఎలాంటి అవాంతరాలు జరగకుండా కృష్ణా, గుంటూరు జిల్లా పోలీసు అధికారులు గత రాత్రి నుంచే తీసుకున్న జాగ్రత్తలన్నీ సఫలీకృతమయ్యాయి. ప్రధానంగా విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ బందోబస్తు ఏర్పాటు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఈ పరుగులో రాష్ట్ర డిజిపి జెవి రాముడు, కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు ఎ, గుంటూరు కలెక్టర్ కాంతీలాల్ దండే, మున్సిపల్ కమిషనర్ జి వీరపాండ్యన్, ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, అనేక మంది క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయతే కాంతీలాల్ దండే మాత్రం యువతకు స్ఫూర్తివంతమైన విధానంతో 21కె రన్‌లో రెండు గంటలపాటు పరుగు సాధించి గమ్యానికి చేరుకుని ఏకంగా ముఖ్యమంత్రి చేతనే శభాష్ అనిపించుకున్నారు. ఉదయం 6:15 గంటలకే 21కె రన్ ప్రారంభమవగా, కేంద్ర మంత్రి ఎం వెంకయ్య నాయుడు 10కె, 5కె రన్‌ను ప్రారంభించారు. ముగింపు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై వివిధ స్థాయిల్లో అధికారులకు, ప్రజాప్రతినిధులకు పరుగు పోటీలు నిర్వహిస్తామని చమత్కరించారు. ఇప్పటివరకు తాను విధుల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నానని, ఇక నుంచి ఆయా రంగాల వ్యక్తులు విధుల్లోనే కాకుండా శారీరక పటుత్వంపై కూడా పోటీ నిర్వహిస్తానంటూ ఉత్సాహంగా చెప్పటంతో సభా ప్రాంగణమంతా నవ్వులు వెల్లివిరిసాయి. ఆరోగ్యవంతమైన ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ను క్రీడలు, పరుగుల ద్వారా యువత నుంచి స్ఫూర్తితో సాధించాల్సి ఉందన్నారు. ప్రతి యువకుడూ కనీసం రోజులో 5-6 కిలోమీటర్ల మేర పరుగును అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. మనకు మెరుగైన మానవ వనరులు అందుబాటులో వున్నాయని, రాష్ట్ర విభజన వలన ఇబ్బందులు ఏర్పడ్డాయని అనుకుంటూ కూర్చుంటే మన జీవితం మొత్తం ఇబ్బందిగానే ఉంటుందని సున్నితంగా హెచ్చరించారు.
కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నేడు ప్రతి ఒక్కరిలో కనిపించిన ఉత్సాహాన్ని చూస్తుంటే ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించుకుని తీరుతామని అనిపిస్తుందన్నారు. ఇందుకనుగుణంగా యువత కూడా కలిసి ముందుకు రావాలంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి, సినీ నటులు రామ్, శర్వానంద్, నాగశౌరి, శాప్ చైర్మన్ మోహన్, గజల్ శ్రీనివాస్, మంత్రులు డాక్టర్ కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమ, ప్రిన్సిపల్ సెక్రటరి సుబ్రమణ్యం, దేశ, విదేశీ క్రీడాకారులు పాల్గొన్నారు.