రాష్ట్రీయం

ఖరీఫ్‌కు దిగుల్లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22:నీటి లభ్యత ఉన్న సాగునీటి ప్రాజెక్టుల నుంచి వీలైనంత త్వరలో ఖరీఫ్‌కు నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖరీఫ్ సీజన్ సాగునీటి కార్యాచరణ ప్రణాళికపై నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు గురువారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సింగూరు, ఘనపురం, ఖడెం, నీల్వాయి, మత్తడి వాగు, కొమురం భీమ్, గొల్లవాగు, నల్లవాగు ప్రాజెక్టుల నుంచి ఖరీఫ్‌కు ముందస్తు నీటి విడుదలకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ప్రస్తుతం నీటి లభ్యత ఉన్న ప్రాజెక్టుల్లో సింగూరు నుంచి 40వేల ఎకరాలు, ఘనపురం నుంచి 20వేల ఎకరాలు, కడెం నుంచి 50వేల ఎకరాలు, నీల్వాయి నుంచి ఏడువేల ఎకరాలు, గొల్లవాగు నుంచి ఆరువేల ఎకరాలు, కొమురం భీమ్ నుంచి 21వేల ఎకరాలు, మత్తడి వాగు నుంచి ఆరువేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించాలని నిర్ణయించారు. దీని కోసం ఎస్‌ఆర్‌ఎస్‌పి, నాగార్జున సాగర్, ఎలిమినేటి మాధవరెడ్డి , నిజాంసాగర్ తదితర ప్రాజెక్టుల పరిధిలో వెంటనే ఇరిగేషన్, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అదికారులతో రైతు అవగాహనా సదస్సులు నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వివిధ ప్రాజెక్టుల డ్యాంల గేట్లను పటిష్టం చేయాలని మరమ్మత్తు పనులను వెంటనే పూర్తి చేయాలని హరీశ్‌రావు కోరారు. ఖరీఫ్ సీజన్‌ను ముందస్తుగా ప్రారంభించడం వల్ల యాసంగిలో ఎక్కవ ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉంటుందని మంత్రి చెప్పారు. గత సంవత్సరం వివిధ ప్రాజెక్టుల కింద జరిగిన ఆయకట్టు వివరాలను రెవెన్యూ , ఇరిగేషన్ శాఖలు సంయుక్తంగా పర్యవేక్షించి రూపొందించిన నివేదికలతో సరిచూసుకోవాలని చెప్పారు. ఖరీఫ్ యాక్షన్ ప్లాన్‌పై మరో వారంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు.
పెద్దపల్లి ప్రాంతంలో నిరుడు ఆయకట్టు చివరి భూమి వరకు నీటిని అందించే ప్రయోగం విజయవంతం అయిందని ఇదే ప్రయోగాన్ని వీలైనన్ని ప్రాజెక్టుల ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీలలో ప్రవేశపెట్టాలని సూచించారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో నిర్వాసితులు అయిన వారి కోసం ఏర్పాటు చేసిన ఆర్ అండ్ ఆర్ కాలనీలను గ్రామ పంచాయితీలుగా మార్చనున్నట్టు చెప్పారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్లను ఆదేశించారు. మిషన్ కాకతీయ మూడో దశ పనులు జరుగుతున్నందున కింది స్థాయి ఇంజనీరింగ్ సిబ్బంది ఆయా మండలాల్లోనే ఉండాలని మంత్రి ఆదేశించారు. భారీ వర్షాలు కురిసినప్పుడు తలెత్తే పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలని మంత్రి సూచించారు.