రాష్ట్రీయం

ఏపిలోనూ బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలోనూ బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ అత్యాధునిక ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ అవసరమైన భూమిని కేటాయిస్తుందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. గురువారం బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 17వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రసంగిస్తూ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సేవా స్పూర్తితో ఆంధ్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలకు వివిధ వైద్య, ఆరోగ్య పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. ఎన్టీఆర్ కుమారుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా క్యాన్సర్ బాధల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించి ఆధునిక వైద్య, ఆరోగ్య సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ్రఎపిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 12 శాతం పెరగడానికి ప్రధాన కారణం గతం కంటే మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడమేనని ఆయన చెప్పారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, ప్రజల ఉమ్మడి సమస్యల పరిష్కారానికి పలు సందర్భాల్లో తెలంగాణ వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో చర్చించి పరిష్కరించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన మంత్రి శ్రీనివాస్ తెలంగాణ వైద్య శాఖ మంత్రి సి. లక్ష్మారెడ్డికి తినిపించారు.