రాష్ట్రీయం

రైతు రుణాలివ్వరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: ఖరీఫ్‌లో పంటల సాగుకు బ్యాంకర్లు రుణాలివ్వడం లేదంటూ ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణల్లోని వాస్తవాన్ని రాష్ట్ర మంత్రులు ఇద్దరు పరోక్షంగా అంగీకరించారు. ఖరీఫ్‌లో పెట్టుబడికి డబ్బుల్లేక రైతులు ఇబ్బందులు పడుతున్నా, ఎందుకు రుణాలివ్వడం లేదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బ్యాంకర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకర్లు సహకరించడం లేదని కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్టస్థ్రాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం శుక్రవారం గ్రాండ్ కాకతీయ హోటల్‌లో జరిగింది. రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళికను మంత్రులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ రుణ మాఫీ పథకం కింద రూ.17 వేల కోట్లు ప్రభుత్వం బ్యాంకర్లకు చెల్లించడం ద్వారా సుమారు రూ.1200 కోట్ల లాభాన్ని బ్యాంకర్లు పొందారన్నారు. ఇంత పెద్ద మొత్తంలో బ్యాంకర్లు లాభంపొంది పంట రుణాలపై పావలా వడ్డీ కోసం రైతులను వేధించడం భావ్యమా? అని మంత్రి ఈటల
ప్రశ్నించారు. ‘పంట రుణ మాఫీ మొత్తాన్ని పువ్వుల్లోపెట్టి బ్యాంకర్లకు చెల్లిస్తే, ప్రభుత్వంపై మీకు కనీసం విశ్వాసం లేదా’ అని మంత్రి ఈటల నిలదీశారు. పంట రుణాల వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుందనడానికి జీవో విడుదల కాలేదని బ్యాంకర్లు చెప్పగా, జీవో కాపీని మంత్రి చూపిస్తూ ‘మరి దీనిని ఏమంటారు?’ అని నిలదీశారు. ‘బ్యాంకులంటే కేవలం వ్యాపారమేనా? మానవీయ కోణం ఉండదా?’ అని ఈటెల నిలదీశారు. ‘మేమేమీ మా సొంతింటి పనికోసం అడగటం లేదు. సమాజహితం కోసం మీ (బ్యాంకర్ల) సహకారం కోరుతున్నాం’ అని మంత్రి మండిపడ్డారు. బ్యాంకులు ఉన్నది కేవలం ధనవంతుల కోసమేనా? సామాన్యులకు రుణాలు ఇవ్వరా? అని మంత్రి ప్రశ్నించారు. ‘బ్యాంకర్ల ధృక్పథం మారాలి. విశాల కోణం నుంచి ఆలోచించడం నేర్చుకోవాలి’ అని మంత్రి ఈటల హితవు పలికారు. బ్యాంకర్ల దృష్టిలో రుణ మాఫీ నెగిటివ్ కావచ్చు కానీ, అది ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని మంత్రి ఈటల స్పష్టం చేశారు.
వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఖరీఫ్‌లో పెట్టుబడికి ఉపయోగపడుతుందని నెలన్నర కిందటే రుణ మాఫీ డబ్బులను బ్యాంకర్లకు చెల్లిస్తే, కొన్నిచోట్ల ఇప్పటికీ రైతుల ఖాతాల్లో జమ చేయలేదన్నారు. గతంలో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ కింద రెండు విడుతల్లో రూ.350 కోట్ల చొప్పున రూ.700 కోట్లు చెల్లిస్తే అవీ కొన్నిచోట్ల రైతులకు అందలేదని పోచారం ఆందోళన వ్యక్తం చేశారు. ఖరీఫ్‌లో పెట్టుబడులకు డబ్బుల్లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని మంత్రి గుర్తు చేశారు.

చిత్రం.. రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఈటల రాజేందర్