రాష్ట్రీయం

రైతు దంపతుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, జూన్ 23: అప్పుల బాధతో రైతు దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన శుక్రవారం రంగారెడ్డి జిల్లా రంగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసు లు, గ్రామస్థుల కథనం ప్రకారం రంగాపూర్‌కు చెందిన పెండ్యాల రాములుచారి, మణెమ్మకు నలుగురు కుమారులు. వీరిలో చిన్నవాడైన మోహనాచారి (45) ఇరవై సంవత్సరాల క్రితం నగరంలోని సరూర్‌నగర్‌కు చెందిన సరిత (40)ను పెళ్లి చేసుకున్నాడు. దంపతులిద్దరూ ఉన్నత చదువులు చదివినవారే. గతంలో ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేశారు. మోహనాచారికి వ్యవసాయంపై మక్కువ ఉండడంతో రంగాపూర్‌లోని తొమ్మిది ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. 2011లో వ్యవసాయంతోపాటు కోళ్లషెడ్డును నిర్మించుకున్నారు. నాలుగేళ్ల అనంతరం కోళ్ల పరిశ్రమలో భారీగా నష్టం వాటిల్లింది. దీంతో పశువుల కోసం షెడ్డును నిర్మించి అవులు, గేదెలు, గొర్రెల పెంపకాన్ని చేపట్టారు. అంతుచిక్కని వ్యాధితో గొర్రెలు చనిపోవడంతో బ్యాంకులో తీసుకున్న అప్పును తిరిగిచెల్లించడం కష్టల,ృమైంది. తన బంధువుల ఆస్తులను తనఖాపెట్టి తీసుకున్న అప్పునూ చెల్లించడం తమవల్ల కాదని ఆత్మహత్యే శరణ్యంగా భావించారు. చివరిసారిగా జూన్ 21న ఆంధ్రా బ్యాంకు రీజినల్ మేనేజర్‌ను కలిసి అదనంగా మరికొంత రుణం మంజూరు చేయాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా లోన్ ఇవ్వడం కుదరదని బ్యాంకు అధికారులు తేల్చిచెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సూసైడ్‌నోట్‌లో రాసి గురువారం రాత్రి దంపతులు ఇరువురు పౌల్ట్రీ షెడ్డులో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
రంగాపూర్‌లో విషాదఛాయలు
దంపతుల ఆత్మహత్యతో రంగాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దంపతులిద్దరూ ఉన్నత చదువులు చదువుకొని వ్యవసాయం చేస్తూ ఉపాధి పొందుతూ గ్రామంలో ఎంతోమందికి ఉపాధి కల్పించారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తంచేసారు. చిన్నప్పుడే మోహనాచారి తండ్రి రాములు చారి చనిపోవడంతో తన అన్నల సహకారంతో డిగ్రీ పూర్తిచేశాడని, ఐటిఐ కూడా చదివాడని స్థానికులు గుర్తుచేశారు. వ్యవసాయంలో ఆదర్శంగా నిలవాలనకున్న జంట ఈవిధంగా ఆత్మహత్యకు చేసుకుంటారని కలలో కూడా ఊహించలేదని గ్రామస్థులు చెప్పారు.
సూసైడ్‌నోట్ స్వాధీనం
సంఘటనా స్థలంలో మోహనాచారి రాసిన మూడు పేజీల సూసైడ్‌నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్‌లో చావుకు గల కారణాలను క్లుప్తంగా వివరించారు. ఇకపై జీవితంలో ముందుకు సాగడానికి ఎలాంటి మార్గం లేకపోవడంతోనే తనువును చాలించడమే మార్గమని నిర్ణయించుకున్నట్లు లేఖలో పేర్కొనడం అందరిచేత కంటతడిపెట్టించింది.

మోహనాచారి, సరిత (ఫైల్)