రాష్ట్రీయం

సంక్రాంతి వేడుకలకు జిల్లాకో రూ.కోటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 10: తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతిని ఘనంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఆదివారం ఉదయం ఉండవల్లిలోని తన నివాస గృహం నుంచి జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సంక్రాంతి వేడుకల నిర్వహణకు గత ఏడాదిలానే ఈ పర్యాయం జిల్లాకు రూ.కోటి నిధులు విడుదల చేస్తామని చెప్పారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వేడుకల నిర్వహణకు ఈ నిధులు ఖర్చుచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమానికి ప్రజా స్పందనపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. కడప జిల్లా పర్యటన అనుభవాలను సిఎం కలెక్టర్లకు వివరించారు. ప్రభుత్వం ఏదో ఇస్తుందని కాకుండా, జన్మభూమి సభలకు హాజరవుతున్న ప్రజలు తమ తమ గ్రామాలు అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షను వ్యక్తపరుస్తున్నామని, అవే విషయాల మీద చర్చించుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటువంటి ప్రణాళిక అమలుచేసి మెరుగైన ఫలితాలు సాధించాలని ముఖ్యమంత్రి కోరారు. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటిలో విద్యార్థులు మంచినీటిని పీల్చే టైల్స్‌ను తయారుచేశారని, వారి నైపుణ్యాలను మార్కెటింగ్ చేస్తే సత్ఫలితాలు వస్తాయని చంద్రబాబు అన్నారు. ఇదిలా ఉంటే తూర్పుగోదావరి జిల్లాలోని 53 మండలాల్లో మండలానికి ఒక్కొక్క పాఠశాలను మోడల్‌గా తీసుకుని మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ తెలిపారు. మరుగుదొడ్ల ఏర్పాటు ఆవశ్యకత, పారిశుద్ధ్యంపై ప్రజా చైతన్యం తేవటానికి విద్యార్థులతో కమిటీలు వేస్తామని చెప్పారు. సిఎం స్పందిస్తూ ఇది చాలా మంచి ఆలోచన అని, అన్ని జిల్లాల్లో అమలు చేయాలని కోరారు. వేసవి సెలవుల్లో 9, 10 తరగతుల పిల్లలకు రెండు వారాలపాటు ఈ దిశలో శిక్షణ శిబిరాలను నిర్వహించాలని సిఎం సూచించారు. ఇలా శిక్షణ పొందినవారు ‘స్వచ్ఛ ఆంధ్ర’పై ప్రజల్లో చైతన్యం తెస్తారని సిఎం అన్నారు.