రాష్ట్రీయం

30వేల మందికో బార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం, జూన్ 24: రాష్ట్రంలో 30 వేల జనాభా ఉన్న ప్రతి పట్టణంలో బార్ ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తున్నట్లు ఎక్సైజ్‌శాఖ మంత్రి జవహర్ తెలిపారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దేవాలయాలు, గృహ సముదాయాలు లేనిచోటే బార్ల ఏర్పాటుకు లైసెన్సులు ఇస్తున్నామన్నారు. ఐదేళ్లపాటు బార్లకు లైసెన్స్‌లు మంజూరు చేస్తామన్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి మద్యం వ్యాపారం చేసే వారికి ప్రతి ఏటా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అత్యంత పాదర్శకంగా లైసెన్స్‌లు జారీ చేస్తున్నామన్నారు. లైసెన్స్ ఫీజు రూ.10, రూ. 20, రూ. 30 లక్షలుగా నిర్ణయించామన్నారు. మద్యం పాలసీని పారదర్శకంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతపురం జిల్లాకు 24 బార్లు మంజూరయ్యాయన్నారు.
ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి అవినీతి చరిత్ర రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ, విదేశీయులందరికీ తెలిసిందేనని మంత్రి అన్నారు. ఎక్సైజ్‌శాఖలో అవినీతికి పాల్పడుతున్నానంటూ సొంత పత్రికలో కథనాలు, ప్రకటనలు చేయడం విచారకరమన్నారు. మద్యం పాలసీని పారదర్శకంగా అమలు చేస్తుంటే ముడుపులు అందాయని వైకాపా నేతలు విమర్శించడం సత్యదూరమన్నారు. ఆరోపణలను నిరూపించాలని ఛాలెంజ్ చేసి 48 గంటలు దాటిందని, అయినా వారి నుండి ఎలాంటి స్పందన లేదన్నారు. జగన్ తాత రాజారెడ్డి, తండ్రి రాజశేఖరరెడ్డి అవినీతి అక్రమాలతో పాటు జగన్ సూట్‌కేస్‌ల పైనే తాను మాట్లాడానన్నారు. జగన్ కుటుంబ చరిత్ర పాఠ్యాంశాల్లో పెట్టుకోదగినదేమీ కాదని ఎద్దేవా చేశారు. తానుఎప్పుడూ మడమ తిప్పని నాయకుడినని జగన్ గొప్పలు చెప్పుకోవడమే తప్ప తమ ఛాలెంజ్‌లకు గానీ, యువనేత లోకేష్‌బాబు చేసిన ఛాలెంజ్‌కు గాని స్పందించడం లేదన్నారు. దళితుడైన తనకు అత్యంత ముఖ్యమైన శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అప్పగించి దళిత పక్షపాతిగా నిలిచాడని, అలాంటి వ్యక్తిపై అవినీతి ఆరోపణలు చేయడం వైకాపా నేతలకు తగదన్నారు. రాజ్యాంగ విలువల గురించి అస్సలు తెలియని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా ఏం మాట్లాడుతారో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. ఇలాంటి వారు రాజకీయాల్లో ఉంటే ప్రజాస్వామ్యానికే తీరని మచ్చ అన్నారు.

చిత్రం.. ధర్మవరంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎక్సైజ్‌శాఖ మంత్రి జవహర్