రాష్ట్రీయం

ప్రమాదానికి గురైతే కొత్త చేసిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: ప్రమాదంలో దెబ్బతిన్న వాహనానికి వేసిన కొత్త ‘చేసిస్’ను రిజిస్ట్రేషన్ చేసి అవసరమైన సర్ట్ఫికెట్ ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ ఆర్‌టిఎ అధికారులను ఆదేశించింది. మహ్మద్ జావిద్ వాహనం ప్రమాదంలో దెబ్బతిన్నది. దీంతో వాహనం చేసిస్ కూడా పూర్తిగా తుక్కుతుక్కు అయ్యింది. తాత్కాలిక రిజిస్ట్రేషన్, వారంటీ గడువులోగా చేసిస్ దెబ్బతిన్నందున సదరు కంపెనీ కొత్త చేసిస్‌ను అమర్చింది. ఇదివరకే రిజిస్ట్రేషన్ చేసినందున, మోటారు వాహనాల చట్టం-1988 ప్రకారం మళ్లీ కొత్త చేసిస్‌కు రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని ఆర్టీఏ అధికారులు తెలిపారు. దీంతో మహ్మద్ జావిద్ న్యాయ స్థానాన్ని ఆశ్రయించాడు. కేసును విచారించిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ టి. రజనీతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు ఆర్‌టిఏ సౌత్ జోన్ అధికారులను ఆదేశించింది.