రాష్ట్రీయం

ఐసిస్ సానుభూతిపరుడు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: విశ్వవ్యాప్తంగా విస్తరిసూ, ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఐసిస్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ సానుభూతిపరుడిని నగర పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. టోలిచౌక్‌లోని పారావౌంట్ కాలనీలో నివాసముంటున్న కొనకళ్ల సుబ్రహ్మణ్యం అలియాస్ ఒమర్‌ను పోలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఒమర్ ఉగ్రవాద సంస్థలో ఎందుకు చేరాడు? హైదరాబాద్‌నే టార్గెట్‌గా కార్యకలాపాలకు ఎందుకు పాల్పడాలనుకున్నాడు? అనే కోణంలో శనివారం దర్యాప్తు ప్రారంభించారు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలానికి చెందిన సుబ్రహ్మణ్యం 2014లో ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. మతమార్పిడి అనంతరం తీవ్రవాదం వైపు ఆకర్షితుడైన ఒమర్ గుజరాత్‌లో ఐసిస్ కార్యకలాపాలపై శిక్షణ తీసుకున్నాడు. అనంతరం శ్రీనగర్, ముంబయి, తమిళనాడు, బెంగుళూరు తదితర ప్రాంతాల్లో పర్యటించాడని సిట్ పోలీసులు గుర్తించారు. సామాజిక మాధ్యమాల ద్వారా యువతను ఉవ్రాదం వైపు ఆకర్షించేదంకు సైతం ఒమర్ ప్రయత్నిస్తున్నట్టు సిట్ ఎస్పీ హరిప్రసాద్ యాదవ్ తెలిపారు. వాట్సాప్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్ ద్వారా యువతకు వల వేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
తల్లిదండ్రులను విచారిస్తున్న సిట్
ఇస్లాం మతాన్ని స్వీకరించిన సుబ్రహ్మణ్యం ఐసిస్ భావజాలానికి ఆకర్షతుడై దేశవ్యాప్తంగా విధ్వంసానికి కుట్ర పన్నాడని గుర్తించిన పోలీసులు అతని తల్లిదండ్రులను విచారిస్తున్నారు. కృష్ణాజిల్లా ఆవనిగడ్డలో ఒమర్ తల్లిదండ్రులు ఆవనిగడ్డ పోలీసులు విచారిస్తున్నట్టు సిట్ అధికారులు తెలిపారు. పదేళ్ల క్రితం చదువును మధ్యలో ఆపేసిన సుబ్రహ్మణ్యం హైదరాబాద్‌కు వచ్చాడు. ఐసిస్ భావజాలానికి ఆకర్షితుడై ఒమర్‌గా పేరు మార్చుకున్నాడని, ఐసిస్ చీఫ్ ఆదేశానుసారం విధ్వంసక చర్యలకు సిద్ధమయ్యాడని తల్లిదండ్రుల విచారణలో స్పష్టమైందని అధికారులు తెలిపారు. కాగా సుబ్రహ్మణ్యం నేపథ్యంపై సిట్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అతని తల్లిదండ్రులు పోలీసుల అదుపులోనే ఉన్నట్టు సమాచారం.

చిత్రం.. ఒమర్ అలియాస్ సుబ్రహ్మణ్యం