రాష్ట్రీయం

సామాజిక మాధ్యమాల్లో భద్రాద్రి మూలవరుల చిత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, జూన్ 24: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం రామాలయంలో వరుసగా చోటు చేసుకున్న సంఘటనలు ఆలయంలో భద్రతను ప్రశ్నిస్తున్నాయి. భద్రతకు పెద్దపీట వేస్తున్నా తరచూ చోటు చేసుకుంటున్న తప్పిదాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. ఇటీవలే భద్రతాపరమైన చర్యల్లో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలోకి సెల్‌ఫోన్లను నిషేధించగా అత్యంత ప్రాధాన్యత కలిగిన గర్భగుడిలోని మూలవరుల చిత్రాలు రెండురోజుల నుంచి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా కనిపిస్తున్నాయి. మొదట అవి మార్ఫింగ్ చేసినవి అని భావించిన అధికారులు అసలువేనని తేలడంతో తలలు పట్టుకుంటున్నారు. భద్రాద్రి రామయ్యకు బెంగుళూరుకు చెందిన భక్తుడు రెండు నెలల క్రితం స్వర్ణకవచాలను సమర్పించారు. ప్రతి శుక్రవారం భక్తులకు స్వర్ణకవచధారణతో స్వామి దర్శనభాగ్యం కల్పించాలని దేవస్థానం ఈవో నిర్ణయించారు. కాగా ఇప్పుడు సోషల్‌మీడియాలో స్వర్ణకవచాలతో ఉన్న మూలవరుల ఫోటోలు కనిపించడంతో కలకలం రేగింది. ఆలయంలోకి సెల్‌ఫోన్లను నిషేధించినా అత్యంత ప్రాధన్యతనిచ్చే మూలవరుల చిత్రాలు బయటకు రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. దేవస్థానం సిబ్బందే ఈ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచారనే అనుమానాలు కలుగుతుండగా ఆలస్యంగా మేల్కొన్న అధికారులు విచారణకు ఆదేశించారు. దేవస్థానంలో విధులు నిర్వహించే సిబ్బందితో పాటు అర్చకులపై కూడా అనుమానాలు వ్యక్తమవుతుండగా ఆలయ పీఆర్‌వో భవానీ రామకృష్ణను విచారణ అధికారిగా వేశారు. 10 రోజుల క్రితం ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయ తలుపులకు తాళాలు వేయకుండా వెళ్లిపోయారు. దీనిపై ఈవో ప్రభాకర శ్రీనివాస్ అర్చకులను, సిబ్బందిని ఇటీవలే తీవ్రంగా మందలించారు. ఇప్పుడు ఏకంగా మూలవరుల ఫోటోలే బయటకు రావడం చర్చనీయాంశమైంది. మూలవరుల ఫోటోలు తీయడం, వాటిని సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో భక్తులు మండి పడుతున్నారు. ఫోటోలు ఎలా బయటకు వచ్చాయి, ఎవరు తీశారు, ఎందుకు సామాజిక మాధ్యమాల్లో ఉంచారనే కోణాల్లో విచారణ చేపడుతున్నారు.

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న మూలవరుల చిత్రం