రాష్ట్రీయం

సైద్ధాంతిక దాడులను తిప్పికొట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల, జూన్ 25: హిందూ ధర్మ వైశిష్టతపై సైద్ధాంతిక దాడులుచేసే వారికి దీటైన సమాధానం చెప్పే యోగ్యులైన యువకులను అన్ని మఠాల అధిపతులు తయారుచేయాలని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం (తిరుపతి) వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి మురళీధరశర్మ పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ హిం దూ ధార్మిక సమ్మేళనంలో భాగంగా సాధు శం ఖారావం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న శ్రీవాసవీ శాంతిధామ్ క్షేత్ర పీఠాధిపతి స్వామి కృష్ణానందపురి, ఆనంద సరస్వతి (ఆనంద ఆశ్రమ పీఠాధిపతి) సిద్ధేశ్వరానంద, శైవక్షేత్ర సభ్యులు శివానంద, ధర్మో రక్షతి రక్షితః సభ్యులు శివస్వామి (మహాసంస్థానం), వాసుదేవానందగిరి (శ్రీ విజయరాజేశ్వరి పీఠం), శ్రీనివాసానంద సరస్వతి (ఉమారామలింగేశ్వర పీఠం), భవానీ శంకరానంద (నవశక్తి పీఠం), హరేశ్వరానంద (హరిహర పీఠం), పీతాంబరం రఘునాధాచారి (అష్టలక్ష్మీపీఠం), గంభీరానంద సరస్వతి, రాజేష్ అఘోరీ తదితరులు ఆధ్యాత్మిక ప్రసంగాలుచేశారు. ఆలయాలను, వేదాలను, గోవులను కాపాడాలని పేర్కొన్నారు. సద్గురువు, ఆచార్యుడు శాస్త్రం చెప్పిన మాటలకు విలువ ఇవ్వాలని సూచించారు. జీవితంలో సమ దర్శనం, స్థితప్రజ్ఞత కోసం సాధన చేయాలని సాధువులు సూచించారు. ధర్మాన్ని, దేవాలయాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలన్నారు. ధనానికి ఇచ్చే విలువ మంత్ర శక్తికి ఇస్తున్నారా అని ప్రశ్నించారు. యంత్రాన్ని నమ్మినట్టు మంత్రా న్ని నమ్మాలన్నారు.