రాష్ట్రీయం

ఆంధ్రుల మణిహారం అమరావతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 25: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి నిర్మాణ దశలోనే జాతీయ ఖ్యాతి లభించగా ఇక నిర్మాణం పూర్తయితే అంతర్జాతీయ ఖ్యాతి పొందుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. అమరావతికి తాజాగా స్మార్ట్ సిటీ గుర్తింపు దక్కిన నేపథ్యంలో చంద్రబాబు ఆదివారం తన నివాస గృహం నుంచి సిఆర్‌డిఏ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రానికి ‘అమరావతి స్మార్ట్’ మణిహారం కానుందన్నారు. ప్రఖ్యాత శాసనసభ, శాసనమండలి, రాజ్‌భవన్, ఉన్నత న్యాయస్థానం, ప్రభుత్వ కార్యాలయాల భవన సముదాయాలు, విద్యానగరం, పారిశ్రామిక నగరం, వాణిజ్య నగరం, మీడియా నగరం, విశాలమైన రహదారులు, పచ్చని వనాలు మొత్తంపై కృష్ణానదీ ప్రవాహంతో కూడిన బ్లూ నగరంగా తీర్చిదిద్దటానికి అధికారులు ఇక వేగవంతంగా, ప్రణాళికాబద్ధంగా నిర్మాణాలు చేపట్టాలంటూ ఆదేశించారు. రాష్ట్ర విభజన జరిగాక కట్టుబట్టలతో రాజధాని నగరం వెతుక్కుంటూ వచ్చేశామని, అభివృద్ధి చెందాలన్న పట్టుదలతో ప్రపంచ ఖ్యాతి నగరాన్ని నిర్మించుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న అమరావతి సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూనే ప్రపంచ శ్రేణి నగరంగా మలచాలని ఆలోచించామన్నారు. దీనికి సహచర మంత్రులు, ఉన్నతాధికార వర్గాలు తన ఆలోచన సహేతుకమైనదేనంటూ సమ్మతించారని చెప్పారు. ఆపై తన మనసులోని మాటను అమరావతి ప్రాంత రైతులకు చెప్పటంతో పెద్ద మనసుతో ముందుకు రాబట్టే భూసమీకరణ విధానంలో నయాపైసా ఖర్చు లేకుండా 33వేల ఎకరాల భూమిని వారివ్వటం ప్రపంచంలోనే ఓ చరిత్ర అని గుర్తుచేశారు. కమ్యూనిస్టు దేశాల్లోనూ ఒకేచోట ఇంత భూమిని సేకరించలేక పోయారని ఆయనన్నారు. రైతుల విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందంటూ ఇక గ్రీన్-బ్లూ అమరావతి నగర నిర్మాణ వేగాన్ని పెంచుదామన్నారు. ముఖ్యంగా 650 ఎకరాల్లో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ప్రపంచ శ్రేణి నగరంగా తీర్చిదిద్దాల్సి ఉందన్నారు. ఒక్క ఆకాశహర్మ్యాలు మాత్రమే కాదు, సగటు మనిషి హాయిగా జీవించేలా గృహం, విద్య, వైద్యం అందుబాటులో ఉండాలన్నారు. రాష్ట్ర రాజధానిలో ప్రజలందరికీ భద్రతను కల్పించేందుకు నిఘా కెమెరాలను ఏర్పాటు చేసేందుకు వీధిదీపాల అమరిక, ఇతర వౌలిక సదుపాయాల కల్పన కోసం తొలి విడతగా రూ.1874 కోట్ల వ్యయం చేయనున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.