రాష్ట్రీయం

ప్రాణం తీసిన అతివేగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/శంషాబాద్, జూన్ 25: హీరో రవితేజ సోదరుడు, నటుడు భూపతిరాజు భరత్ దుర్మరణం చెందా రు. హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. శనివారం రాత్రి నోవాటెల్ హోటల్‌లో స్నేహితులతో ఓ పార్టీకి హాజరైన భరత్ జూబ్లీహిల్స్‌లోని తన ఇంటికి తిరిగి వెళుతుండగా కొత్వాల్‌గూడ వద్ద బ్రేక్ ఫెయిలయి ఆగి ఉన్న ఓ లారీని బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. కారు లారీ అడుగు భాగంలోకి చొచ్చుకుపోయి నుజ్జునుజ్జు కావటంతో భరత్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించారు. కారులోని ఎయిర్‌బ్యాగ్ తెరుచుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు గంటకు 145కి.మీ వేగంతో దూసుకుపోయిందని తేలింది. ప్రమాదం సంగతి తెలిసిన వెంటనే సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కారులోంచి బయటకు తీశారు. కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా మృతుడిని గుర్తుపట్టారు. ఉస్మానియా ఆస్ప్రత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మద్యం మత్తులో అతివేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. భరత్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని ఇన్స్‌పెక్టర్ మహేశ్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు ఇన్స్‌పెక్టర్ తెలిపారు. ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో భరత్ అంత్యక్రియలు జరిగాయి. కాగా రవితేజ, ఆయన తల్లి కడసారి చూసేందుకు రాలేకపోయారు. ప్రమాదంలో భరత్ ముఖం పూర్తిగా దెబ్బతింది. ఈ స్థితిలో భరత్‌ను చూసి తట్టుకోలేమని వారు పేర్కొన్నారు. ఉస్మానియా ఆస్ప్రత్రి నుంచి నేరుగా మహాప్రస్థానానికి మృతదేహాన్ని తరలించి కార్యక్రమాలు పూర్తి చేశారు. కాగా భరత్ మూడో సోదరుడు రఘు, వారి చిన్నాన్న దగ్గరుండి ఈ కార్యక్రమాలు జరిపించారు. సినీ నటులు జీవిత రాజశేఖర్, అలీ, రఘుబాబు, ఉత్తేజ్, కొందరు బంధువులు, జూనియర్ ఆర్టిస్టులు అంతిమ నివాళి అర్పించారు. దాదాపు 30సినిమాల్లో నటించిన భరత్ ‘ఏక్ నిరంజన్’, ‘అతడే ఒక సైన్యం’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు.