రాష్ట్రీయం

సిపిఐ నారాయణకు తప్పిన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 25: సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణకు త్రుటిలో ప్రమాదం తప్పింది. విశాఖ నగరం కేంద్రంగా చోటుచేసుకున్న భూ కుంభకోణంలో ప్రభుత్వ భూములను పరిశీలించే క్రమంలో ఆదివారం ఆయన మధురవాడ, కొమ్మాది ప్రాంతాల్లో పర్యటించారు. కొమ్మాది సర్వే నెంబర్ 28/2లో 22 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను స్థానిక సిపిఐ నాయకులు జెవి సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి ఎజె స్టాలిన్, డి.మార్కండేయులు తదితరులతో పరిశీలించారు. ఈ క్రమంలో ఆక్రమణదారు నిర్మించిన ప్రహారీని కాలితో తన్ని కూల్చేందుకు నారాయణ ప్రయత్నించారు. ప్రహరీ పై భాగం విరిగిపడగా, నారాయణ కాలు సిమెంట్ పలకల మధ్య ఇరుక్కుపోయింది. చిన్నపాటి గాయం కావడంతో నారాయణను ఆసుపత్రికి తరలించారు. ఎక్స్‌రే తీసి పరిశీలించిన వైద్యులు స్వల్ప గాయమేనని, భయపడాల్సిందేమీ లేదని తేల్చారు. దీంతో సిపిఐ ప్రతినిధులు ఊపిరిపీల్చుకున్నారు.

చిత్రం.. ప్రభుత్వ భూమిలో నిర్మించిన ప్రహరీని కూల్చే ప్రయత్నంలో గాయపడిన సిపిఐ నేత నారాయణ