రాష్ట్రీయం

ఇదెక్కడి భూమరాంగ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 26: మియాపూర్‌లో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం నైపథ్యంలో ‘తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్ యాక్ట్- 2017’లో సవరణలు చేసి ఇటీవల తీసుకొచ్చిన రికార్ట్ ఆఫ్ రైట్స్ (ఆర్‌వోఆర్) యాక్ట్ ఆర్డినెన్స్ రాష్టవ్య్రాప్తంగా కలకలం సృష్టిస్తోంది. నిజాం పాలనలో ప్రతీ గ్రామంలో జాగీర్, ఇనాం, వక్ఫ్, దేవాలయ భూములు (దేవుడి మాన్యాలు) ఉన్నాయి. ఈ భూములను విక్రయించడానికి అవకాశం లేకపోయినా చట్టంలోని లొసుగుల ఆధారంగా రెవిన్యూ అధికారుల సహకారంతో క్రయ, విక్రయాలు కొకోల్లలుగా జరిగాయి. అయితే ఈ భూముల క్రయ, విక్రయాలు చెల్లవని, అలాగే వీటికి ఆర్‌వోఆర్ జారీ చేయకూడదని తాజాగా తెచ్చిన ఆర్డినెన్స్‌తో రెవిన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ మార్గాల ద్వారా ఈ భూములను విక్రయించి చేతులు దులుపేసుకున్న వారికి ఈ ఆర్డినెన్స్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేకపోయినా వీటిని కొనుగోలు చేసిన వారు తాజాగా చిక్కుల్లో పడ్డారు. ఎన్నో ఏళ్ళ కింద వీటిని కొనుగోలు చేసినప్పటికీ తాజా ఆర్డినెన్స్‌తో రిజిస్ట్రేషన్స్ రద్దు అయ్యాయి. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ప్రభుత్వ భూములన్నింటికీ వర్తించదు. ఇనాం, జాగీర్ భూములకు మాత్రమే వర్తిస్తుంది. అయినప్పటికీ వక్ఫ్, దేవాలయ భూములను కూడా విక్రయించడానికి అవకాశం లేదని తాజాగా బయటపడటంతో తమ ఆధీనంలోని భూములపై తమకు హక్కులు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి మండల రెవిన్యూ కార్యాలయాల చుట్టూ గత వారం రోజులుగా ప్రదక్షిణలు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆధీనంలోని భూములపై తాజాగా నోటిఫికేషన్ విడుదల చేయడానికి రెవిన్యూ డివిజన్ స్థాయిలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా తమ భూములపై హక్కులు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఇనాం, జాగీర్, వక్ఫ్, దేవాలయ, ధర్మాదాయ భూములను అనుభవస్తున్నవారు ఆరా తీస్తున్నారు. దీంతో మండల రెవిన్యూ, ఆర్డీవో, డిఆర్‌వో కార్యాలయాలు ఆరా తీయడానికి వస్తున్నవారితో కిక్కిరిసి పోతున్నాయి. జాగీర్ భూములు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల చుట్టు పక్కల మాత్రమే ఉండగా ఇనాం భూములు అత్యధికంగా సంస్థానదీశుల పరిధిలోని పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాలో, దేవాలయ భూములు వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో, వక్ఫ్ భూములు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో ఉన్నాయి. జాగీర్ భూములపై నిజాం హయాంలో కల్పించిన స్పష్టమైన హక్కుతో చాలా మటుకు ఇతరులకు చేతులు మారాయి. జాగీర్ భూములలో అనేక రకాలు ఉన్నాయి. కొన్నింటిపైనే వీటిని పొందిన వారికి సర్వ హక్కులు ఉండగా, కొన్ని అనుభవించడానికి తప్ప విక్రయించడానికి అవకాశం లేదు. వీటిని విక్రయించడానికి హక్కు లేని జాగీర్ భూములు సుమారు లక్ష ఎకరాల దాకా ఉంటుందని భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సిసిఎల్‌ఏ) రికార్డులు చెబుతున్నాయి. అయితే ఈ భూములు ఇప్పటికే ముగ్గురు, నలుగురు యజమానుల చేతులు మారాయి. జాగీర్, ఇనాం భూముల సర్వే నంబర్లు తప్ప వీటిపై జరిగిన క్రయ, విక్రయాలకు సంబంధించిన రికార్డులు అందుబాటులో లేవు. వీటిని విక్రయించడానికి అవకాశం లేకపోయినా కొంత మంది సబ్ రిజిస్ట్రార్లు అక్రమాలకు పాల్పడి రిజిస్ట్రేషన్లు చేశారు. తాజా ఆర్డినెన్స్‌తో ఈ క్రయ, విక్రయాలు చెల్లవని తెలయడంతో తమ వద్ద ఉన్న పత్రాలతో రెవిన్యూ కార్యాలయాలలో వాకబు చేస్తున్నారు. అయితే వీటికి సంబంధించిన రికార్డులు కూడా రెవిన్యూ శాఖ వద్ద అందుబాటులో లేకపోవడంతో భూ యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చట్టబద్ధంగా హక్కులు లేని భూములను కొందరు అక్రమంగా పొందిన రిజిస్ట్రేషన్ పత్రాలతో బ్యాంకులకు తనఖా పెట్టి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోవడం, మరి కొందరు వీటి పట్టాదార్ పాసు పుస్తకాలను తనఖా పెట్టి పంట రుణాలు పొందడం జరిగింది. ప్రభుత్వ భూములపై నోటిఫై చేస్తూ ఉత్తర్వులు వెలువడితే తమ బ్యాంకులలో తనఖాలో ఉండిపోయిన వాటి పరిస్థితి ఏమిటని బ్యాంకర్లు కూడా ఆందోళన చెందుతున్నారు. చాలా మటుకు వివాదాస్పద భూములకు వాణిజ్య బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో యజమానులు సహకార బ్యాంకుల నుంచి రుణాలు పొందారు. రుణాన్ని తిరిగి బ్యాంకులకు చెల్లించకపోవడంతో డిఫాల్టర్ల భూములను సహకార బ్యాంకులు బహిరంగ వేలం ద్వారా విక్రయించిన ఉదంతాలు కూడా చాలా ఉన్నాయని రెవిన్యూ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వ భూములపై చట్టపరంగా హక్కులు వాటిపై దశాబ్దాల తరబడిగా జరిగిన లావాదేవీలు చెల్లవని ఆర్డినెన్స్ తేవడంతో వీటిని ఇప్పటిదాకా తమ ఆధీనంలో భూముల పరిస్థితి ఏవౌతుందోనని ఆందోళనకు గురవుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఒకవైపు ఖరీఫ్ సాగు, మరోవైపు ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్ల రద్దు వ్యవహారంతో రైతాంగం తలమునకలైంది.