తెలంగాణ

సివిల్స్ ర్యాంకర్‌పై యుపిఎస్‌సికి ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 26: సివిల్ సర్వీసెస్-2016లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన రోణంకి గోపాలకృష్ణకు చిక్కులు తప్పేలా లేవు. సివిల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ కోసం ఆయన సమర్పించిన అంగవైకల్య ధృవపత్రం సరైంది కాదని ధృవపత్రంలో పేర్కొన్న మేరకు ఆయనకు అంగవైకల్యం లేదని కొంత మంది యుపిఎస్‌సికి ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని వారు డిమాండ్ చేశారు. ఇందుకు ఆధారాలుగా ఆయన సమర్పించిన డాక్యుమెంట్లు, ఆయన ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూల వీడియోలు, ఇతర వివరాలను యుపిఎస్‌సికి పంపించారు. మరో పక్క హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది ఎం మురళీకృష్ణ ప్రజావాజ్య పిటీషన్‌ను హైకోర్టులో సమర్పించారు. పిటీషన్‌ను విచారణకు స్వీకరించేది లేనిదీ మంగళవారం తేలుతుందని తెలిసింది. యుపిఎస్‌సి నిర్వహించిన సివిల్స్ పరీక్షలో గోపాల కృష్ణకు ఎలాంటి అంగవైకల్యం లేకున్నా ఆ కోటా కింద తప్పుడు ధృవీకరణ పత్రం సమర్పించి పరీక్షకు హాజరయ్యారని ప్రజావాజ్య పిటీషన్‌లో పేర్కొన్నట్టు సమాచారం. ఒబిసి అయిన గోపాలకృష్ణ ఆర్ధోపెడిక్ విభాగం ఇచ్చిన 45 శాతం మేర అంగవైకల్య ధృవపత్రాన్ని సమర్పించారని, ఒబిసిలకు ప్రిలిమినరీలో అర్హత మార్కులు 110.66 కాగా, గోపాలకృష్ణ 91.34 మార్కులు మాత్రమే పొందారని, అంగవైకల్యం లేకుంటే ప్రిలిమినరీలో ఎంపిక కాకూడదని పిటీషన్‌లో పేర్కొన్నారు. వికలాంగుల కోటా కింద అర్హత మార్కులు కటాఫ్ 75.34 శాతం కావడంతో మెయిన్ పరీక్షకు ఎంపిక కాగలిగారని పిటీషనర్ పేర్కొన్నారు.