ఆంధ్రప్రదేశ్‌

ఖమ్మం కేంద్రంగా నకిలీ విత్తన దందా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూన్ 26: ఖమ్మం కేంద్రంగా నకిలీ విత్తనాల దందా కొనసాగుతోంది. గతంలో మాదిరిగానే నకిలీ పత్తి, మిర్చి విత్తనాలు గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు మాయమాటలతో అంటగడుతున్నారు. గత ఏడాది ఇదే తరహాలో విత్తన విక్రయాలు జరగ్గా అవన్నీ నకిలీవని అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని 126 విత్తన దుకాణాల లైసెన్సులను రద్దు చేశారు. తిరిగి ఈ ఏడాది ఒక్క విత్తన దుకాణానికి కూడా అధికారులు లైసెన్సులు మంజూరు చేయలేదు. అయితే నలుగురు దుకాణ యజమానులు మాత్రం న్యాయస్థానాన్ని ఆశ్రయించి ప్రభుత్వం తీసుకున్న రద్దు నిర్ణయం అమలుపై స్టే తెచ్చుకున్నారు. ఇదిలావుండగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో లక్షన్నర హెక్టార్లలో పత్తి, లక్ష హెక్టార్లలో మిర్చి వేస్తారని అధికారులు ఇప్పటికే అంచనా వేశారు. అందుకు అనుగుణంగా విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. దీంతో కాలం గడిచిపోతుందనే భయంతో రైతులు ఇతరులను ఆశ్రయించి విత్తనాలను తెచ్చుకుంటున్నారు. ఇందులో అధికమొత్తం నకిలీవనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సూర్యాపేట, ఆదిలాబాద్, కాకినాడ, గుంటూరు, ఒంగోలు ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా విత్తనాలను దొంగచాటుగా ఖమ్మంకు తరలించి ఆయా గ్రామాల్లో తాము ఏర్పాటు చేసుకున్న ఏజెంట్ల ద్వారా అమ్మకాలు సాగిస్తున్నారు.
ఈ విత్తనాలు అమ్మే వ్యక్తుల వివరాలు అటు పోలీసులకు, ఇటు వ్యవసాయాధికారులకు స్పష్టంగా తెలిసినప్పటికీ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. పలు ఎరువులు, విత్తన దుకాణాలపై పలుచోట్ల అధికారులు దాడులు చేయగా వారికి కూడా పెద్ద మొత్తంలోనే నకిలీ విత్తనాలు దొరికాయి. కాగా రెండురోజుల క్రితం వరంగల్ జిల్లా మహబూబాబాద్ ప్రాంతంలో విత్తన సంచులు దొరకగా అవన్నీ ఖమ్మం నుంచే సరఫరా అయినట్లు నిర్ధారణ కూడా అయింది. ఇదే తరహాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని బూర్గంపాడు, చర్ల ప్రాంతాల్లో కూడా నకిలీ విత్తన సంచులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ప్రకాశం జిల్లాలో జరిపిన దాడుల్లో భారీగా పట్టుబడ్డ నకిలీ పత్తి విత్తనాలు ఖమ్మంకు తరలివెళ్ళినట్లు విచారణలో కూడా తేలింది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఖమ్మం కేంద్రంగా నడిపే నకిలీ విత్తన దందాను మాత్రం ఆపలేకపోతున్నారు.
దీనిపై ఇప్పటికే ఇంటిలిజెన్స్ వర్గాలు ప్రత్యేక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందించారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విత్తన విక్రయ దుకాణదారులకు లైసెన్సులే లేవని, ఉన్న ఒకటి రెండు దుకాణాల ద్వారానే విత్తనాల అమ్మకాలు జరుగుతున్నాయని చెబుతుండగా ఇప్పటికే సుమారు 75వేల హెక్టార్లలో పత్తి విత్తనాలను ఎలా వేశారనే దానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.