రాష్ట్రీయం

లండన్‌లో ఘనంగా బోనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 26: లండన్ మహానగరంలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. టిఇఎన్‌ఎఫ్ ఆధ్వర్యంలో హూస్టన్ కమ్యూనిటీ స్కూల్‌లో జరిగిన బోనాల పండుగలో సుమారు 700మంది హాజరై వైభవంగా నిర్వహించారు. పురవీధుల్లో తొట్టెల ఊరేగింపులు నిర్వహించారు. ఈ ఊరేగింపులో తెలుగు సినీ నటి పూనం కౌర్ నెత్తిన బోనమెత్తుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వైభవోపేతంగా జరిగిన ఈ బోనాల ఉత్సవాలు అక్కడున్న తెలుగువారినే గాక, ప్రవాస తెలంగాణ బిడ్డలను కూడా ఆకట్టుకుంది. ఈ ఉత్సవాలకు రిటైర్డు ఐఏఎస్ రామచంద్ర తేజావత్, ఎంపిలు వీరేంద్ర శర్మ, సీమా మల్హోత్ర, బాలాజీ ముఖ్య అతిధులుగా హాజరై ప్రసంగించారు. గడిచిన ఆరేళ్లుగా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఎన్నారై ఫోరం ఈ సంవత్సరం ప్రధానంగా చేపట్టిన చేనేతకు చేయూతనిద్దాం కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా అక్కడి ప్రజలకు పరిచయం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపక చైర్మన్ గంప వేణుగోపాల్, ముఖ్య సలహాదారు అంతటి ప్రమోద్, అధ్యక్షుడు సీకా చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు ప్రవీణ్ గంగసాని, తిరుపతి గోలి, ముఖ్య కార్యదర్శులు నగేష్‌రెడ్డి కాసర్ల, స్కాట్లండ్ కన్వీనర్ శ్రీ్ధర్‌రావు కలకుంట్ల తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. లండన్‌లో జరిగిన తొట్టెల ఊరేగింపులో బోనం ఎత్తుకుని పాల్గొన్న తెలుగు సినీ నటి పూనం కౌర్