తెలంగాణ

ఐ-సేవా ద్వారా రైలు టిక్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: ఐ-సేవా ద్వారా కూడా రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా రైల్వే టిక్కెట్‌లు బుక్ చేసుకునేందుకు ఐఆర్‌సిటిసితో ఇదివరకే ఒప్పందం చేసుకున్నామని హైదరాబాద్, ఆదర్శ నగర్‌లోని ‘ఐ-సేవ’ బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ శ్రీ్ధర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరుద్యోగులు, ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు, వివిధ వ్యాపారులూ తమ దుకాణాల్లో ఆన్‌లైన్ ద్వారా రైల్వే టిక్కెట్లను విక్రయించేందుకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి)లో అధీకృత ఏజెంట్లుగా చేరాలని ఆయన సూచించారు. తమ ‘ఐ-సేవ’ సంస్ధ ఇప్పటికే బస్సు, విమానం టిక్కెట్ సర్వీసులను ఆన్‌లైన్ ద్వారా అందిస్తున్నామని ఆయన వివరించారు. ఇలాఉండగా ఐఆర్‌సిటిసితో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా తమ సేవలను తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్నామని తెలిపారు. కాబట్టి నిరుద్యోగులు, ఇతర వ్యాపారులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఇతర వివరాలకు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఐసేవబిజ్(బి.ఐ.జెడ్.).కామ్‌లో చూడవచ్చని లేదా ఫోన్ 96408 22295 సంప్రదించవచ్చని తెలిపారు.