రాష్ట్రీయం

మొక్కవోని దీక్షతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 27: తెలంగాణలో హరితహారాన్ని మొక్కవోని దీక్షతో నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ కేంద్ర అడవులు, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్దన్‌కు వివరించారు. రాష్టవ్య్రాప్తంగా కోట్లాది మొక్కలను నాటే సంకల్పంతో ముందుకెళ్తున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అటవీ భూముల వినియోగానికి అనుమతించడం పట్ల కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలోవున్న కెసిఆర్ మంగళవారం కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో కలసి శాస్త్ర సాంకేతిక వ్యవహరాలు, పర్యావరణ మంత్రి హర్షవర్దన్‌ను కలిశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ముందుకు సాగడానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర మంత్రి హర్షవర్దన్‌తో కెసిఆర్, దత్తాత్రేయల భేటీ అనంతరం ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిథి వేణుగోపాలచారి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణవ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించామన్నారు. అలాగే జులైలో చేపడుతున్న హరితహారానికి హాజరుకావాలని కూడా హర్షవర్దన్‌ను సిఎం కెసిఆర్ ఆహ్వానించారన్నారు. అలాగే కేంద్రం తెలంగాణకు బకాయిపడిన సుమారు 15 వందల కోట్ల రూపాయల క్యాంపా నిధులను తక్షణం విడుదల చేయాలని కేంద్రమంత్రిని కోరామన్నారు. కేంద్ర మంత్రి బండారు దత్తత్రేయ మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు అటవీ భూములు వినియోగానికి తెలంగాణ ప్రభుత్వానికి అనుమతులు మంజూరు చేసినందుకు హర్షవర్దన్‌కు ధన్యవాదాలు తెలిపామన్నారు. అలాగే 4400 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యమున్న దామరచర్ల ప్రాజెక్టుకూ గత నెల పర్యావరణ శాఖ అనుమతులు ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలిపామన్నారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో సిఎం కెసిఆర్‌తోపాటు ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, కె కేశవరావు తదితరులు ఉన్నారు.

చిత్రం.. ఢిల్లీలో కేంద్ర మంత్రి హర్షవర్దన్‌ను అభినందన పూర్వకంగా కలిసిన సిఎం కెసిఆర్