రాష్ట్రీయం

రవాణా, కార్మిక శాఖను తప్పుపట్టిన హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: రెండు తెలుగురాష్ట్రాల్లో విషాదం నింపిన దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఘటనకు సంబంధించి ట్రావెల్స్‌కు సంస్ధకు ఆంధ్ర రవాణా శాఖ, కార్మిక శాఖ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని హైకోర్టు తప్పు బట్టింది. కృష్ణా జిల్లాలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన దివాకర్ ట్రావెల్స్ బస్సు దుర్ఘటనలో 11 మంది మృతి చెందిన విషయం విదితమే. మోటారు రవాణా కార్మికుల చట్టం 1961ని రూపొందించి ఐదున్నరదశాబ్దాలు గడచినా ఇంకా రెండు తెలుగు రాష్ట్రా లు ఈ చట్టాల అమలుపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయంటూ కెవి సుబ్బారెడ్డి అనే న్యాయవాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథమ్, జస్టిస్ టి రజనితో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. పిటిషనర్ తరఫున న్యాయవాది పివిఏ పద్మనాభం వాదనలు వినిపిస్తూ, ఏపి రవాణా శాఖముఖ్య కార్యదర్శి సుమితా దావ్రా, కార్మిక శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్‌లు దివాకర్ ట్రావెల్స్‌కు క్లీన్ చిట్ ఇచ్చారని, వోల్వో బస్సు దుర్ఘటనలో 11 మంది మరణించారని హైకోర్టుకు తెలిపారు. తెలంగాణ లేబర్ కమిషనర్ శాఖ తమ వద్ద ఈ బస్సు రిజిస్టర్ కాలేదని కోర్టుకు తెలిపారన్నారు. హైదరాబాద్‌కు చెందిన ట్రావెల్స్ బస్సు నిబంధనలు పాటించడంలేదనే విషయాన్ని ప్రస్తావించలేదని న్యాయవాది కోర్టుకు చెప్పారు. ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం జోక్యం చేసుకుని, దివాకర్ ట్రావెల్స్‌కు ఏ విధంగా క్లీన్ చిట్ ఇస్తారని రెండు రాష్ట్రప్రభుత్వాలను హైకోర్టు ప్రశ్నించింది. చట్ట ప్రకారం బస్సు రిజిస్టర్ కాలేదనే విషయం తెలిసి కూడా ఏ విధంగా క్లీన్ చిట్ ఎలా ఇస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఈ ట్రావెల్ సంస్ధ తమ సిబ్బందికి ఎక్కడెక్కడ రెస్ట్‌రూమ్స్‌ను ఏర్పాటు చేసిందో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, తెలంగాణ ప్రభుత్వం వద్ద దివాకర్ ట్రావెల్స్ సంస్ధ రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉందని, ఈ అంశంపై మూడు వారాలు గడువు ఇవ్వాలని కోర్టును అభ్యర్ధించారు. హైకోర్టు ఈ అంశంపై అఫిడవిట్‌ను దాఖలు చేసేందుకు గడువు ఇచ్చింది. వచ్చే దఫా కేసు విచారణ సమయంలో ఆంధ్రాకు చెందిన ఐఎఎస్ అధికారి నీరబ్ కుమార్ కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.