రాష్ట్రీయం

పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి నిధులు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 27: తెలుగు రాష్ట్రాల్లోని పలు పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం రూ.103 కోట్లు విడుదల చేసిం ది. ఏపీకి రూ.49.10 కోట్లు, తెలంగాణకు రూ.54.28 కోట్ల ను మంగళవారం విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై కేంద్ర పర్యాటకశాఖమంత్రి మహేశ్‌శర్మతో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ తన కార్యలయంలో భేటీ అయ్యారు. అనంతరం బండారు దత్తాత్రేయ విలేఖరుతో మాట్లాడుతూ మొదటి విడతలో భాగంగా తెలంగాణలోని కుతుబ్‌షాహీ సమాధి అభివృద్ధికి రూ 19.88 కోట్లు, మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎకో సర్క్యూట్‌కు రూ.18.32 కోట్లు, మలుగు-లక్కవరం ప్రాంతాల మధ్య ట్రైబల్ సర్క్యూట్‌కు రూ.16.06 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు.
దీంతో పాటు ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద తాను దత్తత తీసుకున్న పాత నల్లగొండ జిల్లాలోని కొలనుపాక గ్రామాన్ని పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు ఆరు కోట్ల ప్రతిపాదనలను పర్యాటక శాఖకు అందించినట్టు తెలిపారు. అలాగే యాదాద్రి అభివృద్ధికి కూడా ఆర్థిక సాయం చేయాలని కోరినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని సర్క్యూట్‌కు రూ.34.92 కోట్లు, అమరావతి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి రూ.14.18 కోట్లు విడుదల చేసినట్టుతెలిపారు. కేంద్రమంత్రి మహేష్‌శర్మ విలేఖరులతో మాట్లాడుతూ ఏపి,తెలంగాణ రాష్ట్రాల ప్రతిపాదనలు మేరకు నిధులను విడుదల చేసినట్టు తెలిపారు. తొలిదశలో 20శాతం, రెండోదశలో 60 శాతం, పనులు పూర్తయ్యాక మరో 20శాతం నిధులు విడుదల చేస్తామని చెప్పారు.

చిత్రం.. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ