రాష్ట్రీయం

విశాఖకు త్వరలో ‘నైపర్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 12: రాష్ట్రంపై కేంద్రం కరుణ చూపి వరాల వర్షం కురిపించింది. విశాఖలో సిఐఐ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగిన భాగస్వామ్య సదస్సు మంగళవారంతో ముగిసింది. ముగింపు సమావేశానికి కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంత కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను ఫార్మా హబ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇందులో భాగంగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఇంజనీరింగ్ రిసెర్చ్ (నైపర్) సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలియచేశారు. 600 కోట్ల రూపాయలతో 100 ఎకరాల భూమిలో ఈ ఇనిస్టిట్యూట్‌ను నెలకొల్పనున్నామని, వచ్చే బడ్జెట్‌లో దీన్ని చేర్చనున్నామని ఆయన తెలియచేశారు. త్వరలోనే దీనికి శంకుస్థాపన చేయనున్నామని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా విజయవాడలో ఉన్న సిపిట్ సెంటర్‌లో కెమికల్, పెట్రోకెమికల్, ప్లాస్టిక్ ఇంజనీరింగ్ విద్యను రెండు వందల మంది మాత్రమే అభ్యసిస్తున్నారని, ఈ సంఖ్యను ఐదు వేలకు పెంచాలని నిర్ణయించామని అనంతకుమార్ తెలియచేశారు. అలాగే రాష్ట్రంలో మెడికల్ డివైసెస్ పార్క్ (వైద్య పరికరాల తయారీ యూనిట్)ను ఏర్పాటు చేయనున్నామని ఆయన చెప్పారు. ఒక్కో పార్క్‌లో 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని ఆయన తెలియచేశారు. దీని కోసం పలు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని, కానీ దీన్ని ఎపికే ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి తెలియచేశారు. విశాఖ- కాకినాడ మధ్య పిసిపిఐఆర్ ఏర్పాటు చేయాలని అనుకున్నాం. అయితే దీని స్థానే పెట్రో కెమికల్ పార్క్‌ను ఏపిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అనంత్ కుమార్ తెలియచేశారు. అయితే పెట్రోలియం శాఖ మంత్రితో మరోసారి చర్చించి, హెచ్‌పిసిఎల్‌ను విస్తరించాలా.. లేకుంటే పెట్రోకెమికల్ పార్క్‌ను ఏర్పాటు చేయాలా.. అనేది నిర్ణయిస్తామని ఆయన చెప్పారు. బెంగళూరు-చెన్నై, విశాఖ-చెన్నై కారిడార్లను వీలైనంత త్వరగా సాకారం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

చిత్రం... సదస్సులో మాట్లాడుతున్న
కేంద్ర మంత్రి అనంత్‌కుమార్