రాష్ట్రీయం

ఇలా ఎంవోయు... అలా భూమిపూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్యుతాపురం, జనవరి 12: విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం సెజ్ (ప్రత్యేక ఆర్థికమండలి)లో చైనాకు చెందిన ట్రైనాసోలార్ ఇండియా లిమిటెడ్ సంస్థ నిర్మిస్తున్న సోలార్ ప్యానళ్ల తయారీ పరిశ్రమకు మంగళవారం భూమిపూజ జరిగింది. ఎపిఐఐసి చైర్మన్ ఆర్ క్రిష్టయ్య చేతుల మీదగా కార్యక్రమం నిర్వహించారు. సుమారు 95 ఎకరాల్లో 3వేల కోట్లతో ఏర్పాటు కానున్న ఈ కంపెనీలో ప్రత్యక్షంగా 3వేల ఐదువందల మందికి, పరోక్షంగా మరో మూడువేల ఐదువందల మందికి మొత్తం 7వేల మందికి ఉపాధి దొరుకుతుంది. ఈ సందర్భంగా ఎపిఐఐసి చైర్మన్ క్రిష్టయ్య మాట్లాడుతూ దేశంలోనే తొలి సోలార్ ప్యానళ్ల తయారీ పరిశ్రమ సెజ్‌లో ఏర్పాటు కానుండటం విశేషమన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో చైనా కంపెనీ కుదుర్చుకున్న ఎంఓయు మేరకు 24 గంటల్లోనే కంపెనీ నిర్మాణానికి భూమిపూజ చేసినట్టు ఆయన తెలిపారు. ఈ కంపెనీ నిర్మాణంతో ఈ ప్రాంతంలో నిరుద్యోగులకు మరింత ఉపాధి అవకాశాలు కలగనున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎపిఐఐసి వైస్‌చెర్మన్ శ్రీ్ధర్, ట్రైనాసోలార్ కంపెనీ చైర్మన్ డీయిభాయ్, పరిశ్రమల శాఖ కమిషనర్ ఎస్‌ఎస్ రావత్, ట్రినా కోపరేటివ్ చైర్మన్ కోలిన్, ట్రినా సోలార్ వైస్‌చైర్మన్ ఎరాన్‌చైన్, చైనా ప్రతినిధులు పాల్గొన్నారు.

చిత్రం.. విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో సోలార్ ప్యానళ్ల పరిశ్రమకు భూమి పూజ చేస్తున్న దృశ్యం