రాష్ట్రీయం

అగ్రిగోల్డ్‌కు రెండు వారాల గడువు ఇచ్చిన హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: అగ్రిగోల్డ్ యాజమాన్యం రెండు ఆస్తుల వేలానికి సంబంధించి కొనుగోలుదారుల వివరాలను సమర్పించేందుకు రెండు వారాల గడువును ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇ-యాక్షన్ కింద ఎక్కువ రేట్లు ఇచ్చే కొనుగోలు దారులను గుర్తించాలని హైకోర్టు కోరింది. తెలంగాణ అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్లు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం, జస్టిస్ ఎస్‌వి భట్ విచారించారు. రెండు వారాల్లోపల ఇ యాక్షన్ ద్వారా వచ్చిన రేట్ల కంటే ఎక్కువ రేట్లు చెల్లించేకొనుగోలు దారులను చూపించని పక్షంలో, కంపెనీ తన హక్కును కోల్పోతుందని హైకోర్టు పేర్కొంది.
సిఆర్‌డిఏ అధికారులను ఆదేశించిన హైకోర్టు
ఆంధ్ర రాజధాని అమరావతి పరిధిలో రైతులు సామాజిక ప్రభావిత అంచనాలపై తమ అభిప్రాయాలను తెలియచేసేందుకు ఆరు వారాల వరకు గడువు ఇవ్వాలని హైకోర్టు సిఆర్‌డిఏ అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలను జస్టిస్ బి శివశంకర్ రావుజారీ చేశారు. ఈ కేసులో పిటిషనర్ల తరఫున పి సుధాకరరెడ్డి వాదనలు వినిపించారు.