రాష్ట్రీయం

విజయనగరం రైల్వే స్టేషన్‌లో హైస్పీడ్ వైఫై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూలై 13: విజయనగరం రైల్వే స్టేషన్‌లో హైస్పీడ్ వైఫై సర్వీసులను వీడియో లింక్ ద్వారా గురువారం కేంద్రమంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు. అనంతరం ఆయన ఢిల్లీలోని రైల్ భవన్ నుంచి మాట్లాడుతూ డిజిటల్ ఇండియాలో భాగంగా రైల్వే ప్రయాణికులకు ఉచిత వైఫై సర్వీసులు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇప్పటి వరకు దేశంలో 127 ప్రధాన రైల్వే స్టేషన్లలో వైఫై సర్వీసులు అందుబాటులో ఉన్నాయన్నారు. మరో 200 ప్రధాన స్టేషన్లలో వైఫై సర్వీసులు అందించాలని నిర్ణయించినట్టు తెలిపారు. దాంతోపాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కూడా సర్వీసులు అందజేయాలని నిర్ణయించామన్నారు. పాన్ ఇండియా ఆప్టిక్ ఫైబర్ నెట్‌వర్క్ ద్వారా ఈ సర్వీసులు అందుతున్నాయన్నారు. దాదాపు 70 శాతం మంది జనాభాకు ఈ సర్వీసులు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. గత ఏడాది ముంబయిలో మొదటి సారిగా వైఫై సర్వీసులను ప్రారంభించామన్నారు. ఆ తరువాత పూణే, భువనేశ్వర్, భూపాల్, రాంచి, రాయ్‌పూర్, విజయవాడ, కాచిగుడా, ఎర్నాకుళం జంక్షన్, విశాఖపట్నం ప్రాంతాలకు విస్తరించామన్నారు. త్వరలో మిగిలిన ప్రాంతాలకు వీటిని విస్తరిస్తామని వివరించారు. దీంతోపాటు విశాఖ వరకు నడిచే హమ్‌సఫర్ వీక్లి ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా విజయనగరం రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర భూగర్భ గనులశాఖ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఫై సేవలు అందుబాటులోకి వచ్చిన రైల్వే స్టేషన్లలో విజయనగరం ఏడో స్టేషన్‌గా పేర్కొన్నారు. కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు కృషితో విజయనగరం స్టేషన్ అభివృద్ధి చెందనుందన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, ఎమ్మెల్సీలు జగదీష్, పివిఎన్ మాధవ్, ఎమ్మెల్యే చిరంజీవులు, కలెక్టర్ వివేక్‌యాదవ్, డిఆర్‌ఎం ముకుల్ శరణ్ మాధుర్, స్టేషన్ మాస్టర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. ఢిల్లీ నుంచి వైఫై సర్వీసులను ప్రారంభిస్తున్న రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు, అశోక్‌గజపతిరాజు తదితరులు