రాష్ట్రీయం

మరొకడు దొరికాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: రాష్ట్ర రాజధానిలో విస్తరించిన డ్రగ్ మాఫియాలో కీలక సూత్రధారిగా భావిస్తున్న పియూష్ (29)ని శుక్రవారం మారేడ్‌పల్లి ప్రాంతంలో ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. మూడున్నర లక్షల విలువగల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పియూష్ జర్మనీ, ఇంగ్లండ్ నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ తెప్పించినట్టు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎల్ వివేకానంద రెడ్డి మీడియాకు వివరించారు. పియూష్‌ను, ఆయన వద్ద స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను మీడియా ఎదుట ప్రదర్శించారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన పియూష్ ఒక కంపెనీలో ఉద్యోగం చేసేవాడని, గత ఏడాది నోట్ల రద్దు తర్వాత డ్రగ్స్ వ్యాపారాన్ని ఎంచుకున్నాడని చెప్పారు. డ్రగ్స్ వ్యాపారం చేసేందుకు ఆన్‌లైన్ ద్వారా ఎలా బుక్ చేసుకోవడం అనేది ఇంటర్‌నెట్‌లో పరిశీలించి, తర్వాత జర్మనీ, ఇంగ్లండ్ నుంచి తెప్పించినట్టు వివరించారు. మూడున్నర లక్షల విలువగల 80 బ్లాట్లు, వైట్ పౌడర్, బెన్‌లార్, ఆక్సెప్టా, ఫెనిగ్ర, ల్యాప్ ట్యాప్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఒక్కో బ్లాటు సుమారు రెండున్నర వేలు ఉంటుందని చెప్పారు. పియూష్ మొబైల్‌లోని పేర్లను, కాల్‌డేటాను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. పియూష్‌తో సంబంధాలున్న ఆది, విజయ్‌ను అదుపులోకి తీసుకుని విచారించనున్నట్టు చెప్పారు. పియూష్ ఇంకా ఎవరెవరికి మత్తు పదార్థాలు విక్రయించాలని అనుకున్నాడనే కోణాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. పియూష్ తండ్రి పంజాబ్ బిహెచ్‌ఇఎల్ నుంచి పదవీ విరమణ చేశారని డిసిపి వివేకానంద రెడ్డి తెలిపారు.

చిత్రం.. పియూష్‌ని మీడియాకు చూపిస్తున్న ఎక్సైజ్ డిసిపి వివేకానందారెడ్డి